Homeవినోదంఅల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం...

అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?


Did Revanth take the risk of Allu Arjuns arrest : అల్లు అర్జున్ అరెస్టుపై చట్టం తన పని తాను చేసుకుపోతుదంని సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇలాంటి అరెస్టులు జరిగినప్పుడు అధికారంలో ఉన్న వారు రొటీన్‌గా చెప్పే సమాధానం ఇది.  ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. చట్ట ప్రకారం అరెస్టు చేయాల్సి ఉందని అనుమతి తీసుకోవడం, రెండు అరెస్టు చేయమని తన వైపు నుంచి సంకేతాలు వెళ్లడం. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి  అనుమతి ఇచ్చానని అంగీకరించారు. హోంశాఖ తన వద్దే ఉందని  అల్లు అర్జున్ కేసు గురించి తనకు మొత్తం తెలుసని  స్పష్టం చేశారు. 

రాజ్యాంగం ప్రకారం పాలన జరుగుతుందన్న సంకేతాలు 

రాజ్యాంగం ఉంది దానికి అనుగుణంగానే చట్టం పనిచేస్తుందని అర్జున్ కేసులో కూడా అంతేనని స్పష్టం చేశారు.  అక్కడ మహిళ చనిపోయింది, ఆమె కొడుకు ఇంకా జీవన్మరణ సమస్యతో పోరాడుతున్నాడని దానికి బాధ్యులెవరని ప్రశ్నించారు. జనం ప్రాణాలు పోయినా కేసు పెట్టొద్దా అని ప్రశ్నించారు. కారులో వచ్చి సినిమా చూసి వెళ్తే ఎటువంటి సమస్య ఉండకపోయేదని..  కానీ కారులోంచి బయటికి వచ్చి చేతులుపి హడావిడి చేశారని.. దాంతో జనం పెద్ద ఎత్తున ఎగబడ్డారు కంట్రోల్ కాలేదన్నారు. అందుకే అల్లు అర్జున్ ను ఈ కేసులో A11 గా పోలీసులు పెట్టారన్నారు. వాళ్లు ప్రత్యేకంగా దేశం కోసం చేసింది ఏం లేదని సినిమాలు తీశారు.. సంపాదించుకున్నారని అన్నారు. సరిహద్దుల్లో యుద్ధాలు చేసి విజయాలు తెచ్చారా అని ప్రశ్నించారు. 

Also Read: Support From YSRCP: అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు – లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !

రేవంత్ రెడ్డి తన హయాంలో చట్టం ఎంత నిష్పక్షిపాతంగా పని చేస్తుందో చెప్పడానికి ఈ కేసునే ఉదాహరణగా చెప్పారు. నాకు చిన్నప్పటినుంచి అల్లు అర్జున్ తెలుసు, అతనికి తాను తెలుసన్నారు.  అల్లు అర్జున్ మామ చిరంజీవి కాంగ్రెస్ నేత  అని గుర్తు చేశారు.  అల్లు అర్జున్ కు పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేత .. నాకు బంధువు  కూడా అని తిలెపారు.  అల్లు అర్జున్ భార్య మాకు బంధువని.. స్పష్టం చేశారు. అయితే చనిపోయిన మహిళ కొడుకు ఇంకా కోమాలో ఉన్నాడని దానికి బాధ్యుల్ని వదిలి పెట్టాలా అని ప్రశ్నించారు. అంటే తన హయాంలో చట్టమే ఫైనల్ అని బంధువుల్ని కూడా వదలనని ఆయన చెబుతున్నారు. 

Also Read: అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ – హైకోర్టులో ఊరట – చంచల్ గూడ జైలు తప్పినట్లే !

రాజకీయంగా నష్టం జరగదా ?

రేవంత్ రెడ్డి ఇలా ముక్కుసూటిగా వ్యవహరిస్తే ఆయనకు రాజకీయంగా తీవ్ర నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇదే అంశం ఆయనకు తెలియదా అనే సందేహం చాలా మందికి వస్తోంది. అయితే రేవంత్ రెడ్డి కింది స్థాయి నుంచి రాజకీయంగా ఎదిగిన లీడర్ అని రాజకీయాలు ఎలా చేయాలో ఎవరైనా ఆయనకు ఎలా చెబుతారన్న సందేహాలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి చట్టం అమలు విషయంలో ప్రజలకు ఓ భరోసా ఇవ్వాలనుకున్నారని అంటున్నారు. రేవంత్ రెడ్డి తీరు తాత్కాలికంగా ఆయనకు  రాజకీయ నష్టాలు చేస్తుందేమో కానీ ప్రజలకు మాత్రం వ్యవస్థలపై విశ్వాసం పెంచుతుందన్న అభిప్రాయం ఎక్ుకవగా వినిపిస్తోంది.  

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments