మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా ‘విశ్వంభర’. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీధర్ రెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ ఎలా కనిపిస్తారు? ఆయన లుక్ ఎలా ఉండబోతుంది? అనేది మరికొన్ని గంటల్లో తెలుస్తుంది.
గురువారం ఉదయం 10.08 గంటలకు!
ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే. ఈ సందర్భంగా మిడ్ నైట్ 12 గంటలకు ‘విశ్వంభర’ ప్రీ లుక్ విడుదల చేశారు. అందులో పర్వతాల నడుమ ప్రకాశవంతమైన కాంతి, ఆ వెలుగుకు ముందు చిరంజీవి నిలబడినట్టు ఉంది. ఆ కాంతి వెనుక ఉన్నది ఏ శక్తి? అక్కడ చిరు ఏం చేస్తున్నారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. గురువారం (ఆగస్టు 22, చిరు బర్త్ డే) ఉదయం 10.08 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్టు యువి క్రియేషన్స్ వెల్లడించింది.
Also Read: ఓటీటీలోకి వచ్చేసిన ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ – ఏ లాంగ్వేజ్ వెర్షన్ ఎందులో స్ట్రీమింగ్ అవుతోందంటే?
The legend shall rise on this special day 💫
Today at 10.08 AM. Stay tuned.#Vishwambhara
Get ready for a MEGA MASS BEYOND UNIVERSE, In cinemas from January 10th, 2025 🌠#HBDMegastarChiranjeevi
MEGASTAR @KChiruTweets @trishtrashers @DirVassishta @AshikaRanganath… pic.twitter.com/ucnqXZhc5O
— UV Creations (@UV_Creations) August 21, 2024
ఆంజనేయుడి ముందు చిరంజీవుడు!
‘విశ్వంభర’ సినిమా యూనిట్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం… చిరు బర్త్ డే కానుకగా రిలీజ్ చేయడానికి ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, సాంగ్ రెడీ చేశారని తెలిసింది. ఆ మూడింటిలో ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట. ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే… ఆంజనేయుడి విగ్రహం ముందు గదతో ఉన్న చిరంజీవి (విశ్వంభర) పోస్టర్ విడుదల కానుందట.
తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేనకు చిరు ఆ మధ్య రూ. 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చిన విషయం గుర్తు ఉందా? ఆ ఫోటోల్లో ఆంజనేయుడి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం ముందు చిరంజీవి ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. సోషియో ఫాంటసీ సినిమాల్లో చిరుకు మంచి రికార్డ్ ఉంది.
‘విశ్వంభర’ను సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సౌత్ క్వీన్ త్రిష కృష్ణన్ కథానాయిక కాగా… ఆషికా రంగనాథ్, సురభి, రమ్య పసుపులేటి, ఇషా చావ్లా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కునాల్ కపూర్ పవర్ ఫుల్ విలన్ రోల్ చేస్తున్నారు. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో పాటు ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ సీన్లకు సైతం లోటు లేదట. ఎంఎం కీరవాణి సంగీతంలో చంద్రబోస్ పాటలు రాస్తున్నారు. ఇద్దరు ఆస్కార్ పురస్కార గ్రహీతలు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఛోటా కె నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్.
మరిన్ని చూడండి