Homeవినోదం'అన్‌స్టాపబుల్ 4' షో కోసం రామ్ చరణ్ వేసుకున్న హుడీ కాస్ట్ ఎంతో తెలిస్తే దిమ్మ...

‘అన్‌స్టాపబుల్ 4’ షో కోసం రామ్ చరణ్ వేసుకున్న హుడీ కాస్ట్ ఎంతో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్వరలోనే ‘అన్ స్టాపబుల్ సీజన్ 4’ షోలో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 31న ఈ ఎపిసోడ్ షూటింగ్ జరగ్గా… దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. షోలో బాలయ్య, చెర్రీ కాంబో చూడడానికి ఆసక్తికరంగా అన్పించింది. అయితే అన్నిటికంటే ఎక్కువగా అట్రాక్ట్ చేసింది మాత్రం రామ్ చరణ్ వేసుకున్న హుడీ. సాధారణంగా సెలబ్రిటీలు ఇలా స్పెషల్ లుక్ లో కనిపించారంటే చాలు… వెంటనే వాళ్ళు వేసుకున్న షర్ట్, బ్యాగ్, గాగుల్స్, వాచ్ ఇలా అన్నింటి ధరను సోషల్ మీడియాలో సర్చ్ చేసి ఇట్టే పట్టేస్తుంటారు. రామ్ చరణ్ ‘అన్ స్టాపబుల్ సీజన్ 4’ షోలో వేసుకున్న హుడీ రేటు కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. 

చెర్రీ వేసుకున్న హుడీ రేటు ఎంతో తెలుసా? 
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ అనే పాన్ ఇండియా మూవీ జనవరి 10న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్లలో భాగంగా రామ్ చరణ్ సెలబ్రెటీ టాక్ షో ‘అన్ స్టాపబుల్ సీజన్ 4’ షోకి హాజరయ్యారు. ఈ షోకి బాలయ్య హోస్టుగా వ్యవహరిస్తుండగా, ఆహాలో సీజన్ 4 స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.

నిన్న బాలయ్య “బ్రో అనకు… నా సెట్లోకి ఎవ్వరినీ అలో చెయ్యను” అంటూ సెటైర్లు వేస్తూనే, రామ్ చరణ్ (Ram Charan)ని ఆప్యాయంగా షోకి ఆహ్వానించారు. ఇక షో టైంలో రామ్ చరణ్ వేసుకున్న హుడీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఈ బ్లాక్ హుడీ ‘అమిరి’ అనే బ్రాండ్ కు సంబంధించింది. కాటన్ బ్లెండ్ తో మిక్స్ అయ్యి ఉన్న ఈ షర్ట్ పై బ్రాండ్ నేమ్ ఉండడంతో పాటు హ్యాండ్స్ కి సైడ్స్ కి రెడ్ కలర్ లైన్స్ తో డిఫరెంట్ డిజైన్ వచ్చి, మరింత అట్రాక్టివ్ గా ఉంది. ఈ హుడీ రేటు ఏకంగా రూ. 88, 126. నిజానికి దాని ధర అక్షరాలా లక్షకు పైమాటే. కానీ ప్రస్తుతం ఆఫర్ లో రూ.88 వేలకి ఈ షర్ట్ అందుబాటులో ఉంది. ఇక రామ్ చరణ్ షర్ట్ కాస్ట్ తెలిసిన నెటిజన్లు నోరెళ్ళబెడుతున్నారు. మరి గ్లోబల్ స్టార్ అంటే ఈ రేంజ్ లో మెయింటెనెన్స్ ఉండాల్సిందే కదా అంటూ కాలర్ ఎగరేస్తున్నారు మెగా ఫాన్స్.

Also Readఎక్స్‌క్లూజివ్… మహేష్ బాబు – రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!


ఇక ఈ వీక్ అంతా మెగా ఫెస్టివల్ జరగబోతోంది. జనవరి 2న రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్లో రాబోతున్న ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘హరిహర వీరమల్లు’ నుంచి ఫస్ట్ సింగిల్ కూడా జనవరి మొదటి వారమే రాబోతోంది. ఇప్పటికే మేకర్స్ జనవరి 6న ‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి ‘మాట వినాలి’ అనే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయబోతున్నామని అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read‘గేమ్ చేంజర్’ సెన్సార్ రిపోర్ట్… రామ్ చరణ్ సినిమా ఇంటర్వెల్, సెకండాఫ్ గురించి చెప్పేది వింటుంటే?

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments