Anasuya Bharadwaj comments on Sandeep Reddy Vanga Animal goes viral: తన సినిమా మీద, సినిమాలో సన్నివేశాల మీద ఎవరైనా కామెంట్ చేస్తే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వదిలిపెట్టడు. దిగ్గజ రచయిత జావేద్ అక్తర్ అయినా సరే, బాలీవుడ్ లేడీ డైరెక్టర్ & ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ అయినా సరే… టిట్ ఫర్ టాట్ అన్నట్టు ఏకిపారేస్తాడు. ఇప్పుడు ఒక్కప్పటి టాలీవుడ్ స్టార్ యాంకర్, పాన్ ఇండియా యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్ చేసిన కామెంట్స్ మీద ఎలా రియాక్ట్ అవుతాడు? అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే… ‘యానిమల్’ సినిమా మీద ఆవిడ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘యానిమల్’ మీద అనసూయ ఏం కామెంట్ చేసింది?
Anasuya Comments On Animal Movie: హిందీ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ బాక్సాఫీస్ బరిలో భారీ విజయం సాధించింది. అలాగే, విమర్శల పాలు కూడా అయ్యింది. ఆ సినిమాతో పాటు అందులో సన్నివేశాల పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.
‘యానిమల్’ సినిమాలో తండ్రి మీద దాడి చేసిన వ్యక్తుల మీద పగ తీర్చుకోవడానికి వెళ్లే ముందు ఒకవేళ తాను బతికి రాకపోతే మళ్లీ పెళ్లి చేసుకోవద్దని భార్యతో హీరో చెబుతాడు. అక్కను మాత్రం మళ్లీ పెళ్లి చేసుకోమని చెబుతాడు. ఇదెక్కడి న్యాయం అని అనసూయ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. ఇప్పుడు ఆమె చేసిన ఆ స్టోరీ వైరల్ అవుతోంది.
Also Read: ఫుల్లుగా తాగి రోడ్డున పడ్డ చందు – ఆత్మహత్యకు ముందు ఏం చేశాడో చెప్పిన భార్య శిల్ప
‘అర్జున్ రెడ్డి’ మీద కూడా కామెంట్స్ చేసిన అనసూయ
సందీప్ రెడ్డి సినిమా మీద అనసూయ కామెంట్స్ చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. ఆయన దర్శకుడిగా పరిచయమైన, తెలుగులో తీసిన ‘అర్జున్ రెడ్డి’ మీద కూడా గతంలో కామెంట్స్ చేసింది. అందుకు గాను తనను విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ టార్గెట్ చేశారని, ఆంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారని అప్పట్లో ఒక రేంజిలో ఫైర్ అయ్యింది. ట్విట్టర్ సాక్షిగా తన మీద కామెంట్స్ చేసిన ఒక్కొక్క నెటిజన్ పట్ల ఘాటుగా రియాక్ట్ అయ్యింది. ఇప్పుడు మరొకసారి సందీప్ రెడ్డి వంగా సినిమాను టచ్ చేసింది అనసూయ.
‘యానిమల్’ మీద బాలీవుడ్ సెలబ్రిటీలు చేసిన కామెంట్స్ పట్ల సందీప్ రెడ్డి వంగా ఊరుకోలేదు. ఒక్కొక్కరికీ ఇచ్చి పడేశాడు. మరి, అనసూయను ఏం అంటాడో చూడాలి. ప్రజెంట్ ‘యానిమల్’ సీక్వెల్ ‘యానిమల్ పార్క్’, ఆ తర్వాత ప్రభాస్ హీరోగా తీయబోయే ‘స్పిరిట్’ స్క్రిప్ట్ పనుల్లో సందీప్ బిజీగా ఉన్నాడు.ఒకవేళ గనుక అతడు రియాక్ట్ అయితే అది భారీగా ఉంటుందని చెప్పవచ్చు. అనసూయ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంది. ‘పుష్ప 2’తో పాటు మరికొన్ని సినిమాలు చేస్తోంది.
మరిన్ని చూడండి