Anu Aggarwal: చాలామంది నటీనటులు ఒక్క సినిమాతో స్టార్‌డమ్ సంపాదించుకొని వెంటనే కనుమరుగు అయిపోతారు. బాలీవుడ్‌లో కూడా అలాంటి నటీనటులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు అను అగర్వాల్. ‘ఆషిఖీ’ అనే మూవీతో ఒక్కసారిగా స్టార్ స్టేటస్‌ను సంపాదించుకున్నారు అను. ఆ తర్వాత తను నటించిన ‘ది క్లౌడ్ డోర్’ అనే షార్ట్ ఫిల్మ్‌లో షర్ట్ లేకుండా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అప్పట్లో ఈ షార్ట్ ఫిల్మ్ ఏకంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్క్రీన్ అయ్యింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అను అగర్వాల్.. ఇలాంటి బోల్డ్ సీన్‌లో నటించడానికి ఎలా ఒప్పుకున్నారో బయటపెట్టారు.
స్క్రిప్ట్‌లో లేదు..
ముందుగా ‘ది క్లౌడ్ డోర్’ స్క్రిప్ట్‌ను తను చదివినప్పుడు అందులో షర్ట్ లేకుండా నటించాలనే సీన్ లేదంటూ చెప్పుకొచ్చారు అను అగర్వాల్. షూటింగ్ మొదలయిన 29 రోజుల తర్వాత దర్శకుడు ఈ ఐడియా చెప్పగానే ఒక్కసారిగా ఆమె షాక్ అయ్యారట. ‘‘మేము పూర్తిగా 30 రోజులు షూటింగ్ చేయాలనుకున్నాం. 29వ రోజు డైరెక్టర్ వచ్చి నాకు బోల్డ్ సీన్ గురించి చెప్పారు. నైట్ షూట్ అన్నారు. నేను షాకయ్యాను. ఏంటి నువ్వు మాట్లాడేది అని నేను సీరియస్ అయ్యాను. ఇది స్క్రిప్ట్‌లో లేదన్నాను. అందుకే చేయను అన్నాను. నేను ఆ బోల్డ్ సీన్ చేయలేనని కాదు.. కానీ చేయకూడదు అనుకున్నాను’’ అని తెలిపారు అను అగర్వాల్.
ఫైనల్‌గా ఒప్పుకున్నాను..
‘ది క్లౌడ్ డోర్’ షూటింగ్ పూర్తి చేసుకొని ముంబాయ్ తిరిగి వెళ్లిపోతున్న సమయంలో తాను తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అని తనకే అనుమానం కలిగిందట. ముందు నుండే స్క్రిప్ట్‌లో ఆ బోల్డ్ సీన్ పెట్టుంటే దాంట్లో నటించాలా వద్దా అని తాను నిర్ణయించుకునేదాన్ని అని తెలిపారు. ‘‘షర్ట్ లేకుండా అందరి ముందు నిలబడడం అనేది చాలా పెద్ద విషయం. ఇదేమీ అందరూ రోజూ చేసేది కాదు. చాలా భిన్నమైనది. ఒక నెల తర్వాత దర్శకురాలు ఫోన్ చేసి కేన్స్‌కు మన షార్ట్ ఫిల్మ్ సెలక్ట్ అయ్యింది అన్నారు. అప్పటికి ఆ సీన్ ఉంటే బాగుంటుందని చెప్పారు. నేను షర్ట్ లేకుండా నటిస్తే ఆమెకు ఏం వస్తుంది అనుకున్నాను. ఫైనల్‌గా ఆ సీన్ చేయడానికి నేను ఒప్పుకొని దాని షూటింగ్ కోసం తిరిగి వెళ్లాను’’ అని గుర్తుచేసుకున్నారు అను.
బాధగా అనిపించింది..
‘‘అలాంటి బోల్డ్ సీన్‌లో నటించడం నాకు చాలా బాధగా అనిపించింది. అది కేవలం సినిమా కోసమే అయితే కచ్చితంగా నేను చేయకపోయేదాన్ని. నా చేతిలో ఉన్న విషయం అయ్యింటే కచ్చితంగా షర్ట్ వేసుకునే నటించేదాన్ని. కానీ నటిగా నాకు అది పెద్ద ఛాలెంజ్. అందుకే ఒప్పుకున్నాను’’ అని తెలిపారు అను అగర్వాల్. ‘దొంగ దొంగ’, ‘ఆషిఖీ’తో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న తర్వాత ‘ది క్లౌడ్ డోర్’ను చేయడానికి ఒప్పుకున్నారు అను. మణి కౌల్ దీనికి దర్శకత్వం వహించారు. అప్పట్లో అను అగర్వాల్‌కు బాలీవుడ్‌లో చాలా డిమాండ్ ఉండేది. కానీ 1999లో జరిగిన ఒక ప్రమాదం వల్ల తన కెరీర్ మరో మలుపు తిరిగింది.
Also Read: కత్రినాను డైరెక్ట్ చేయడం చాలా కష్టం, మీరు నన్ను చీట్ చేశారని అంది – దర్శకుడు విజయ్ భాస్కర్
మరిన్ని చూడండి