మేషరాశి
మేషరాశి వారికి ఈ వారం జన్మరాశి యందు గురురాహువుల ప్రభావంచేత, కళత్ర స్థానములో కేతువు ప్రభావంచేత కుటుంబములో సమస్యలు అధికముగా ఉండును. వాదోపవాదాలకు దూరంగా ఉండాలని సూచన. చతుర్ధ స్థానములో శుక్రుడు, దశమ స్థానములో బుధుని యొక్క అనుకూల ప్రభావంచేత ఈవారం వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా కొంత అభివృద్ధి కలుగును. లాభస్థానములో శని అనుకూల ప్రభావం వలన మీరు అనుకున్న ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. విద్యార్థులకు ఈవారం కలసివచ్చును. ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళు ఏర్పడును. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయం. మొత్తం మీద ఈవారం మేషరాశివారికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. మేషరాశివారు ఈవారం దక్షిణామూర్తిని పూజించాలి. అదివారం, మంగళవారం, శనివారం రాహుకాల సమయంలో దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యుణ్ణి పూజించినట్లయితే మరింత శుభఫలితాలు కలుగుతాయి.