మకరరాశి :
మకరరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. బంధువులు, మిత్రుల సలహాలు పొందుతారు. ఆరోగ్యపరంగా చికాకులు తొలగుతాయి. భూములు, వాహనాలు కొంటారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వ్యాపారస్తులకు అనుకూలం. ఉద్యోగస్తులకు కొత్త హెూదాలుంటాయి. కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి. ధనవ్యయముండును. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాగలవు. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి శనికి తైలాభిషేకం చేయండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.