తులారాశి :
తులారాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారుల సహకారాలుంటాయి. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ప్రయాణాలు లాభదాయకం. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. కుటుంబపరంగా అనుకూల సమయం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. తులారాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి.