తొలి సూర్య గ్రహణం
2024 సంవత్సరంలో తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 8న ఏర్పడుతుంది. ఆ రోజు రాత్రి 9.12 గంటలకి ప్రారంభమై అర్థరాత్రి 1.25 గంటలకు ముగుస్తుంది. గ్రహణానికి 12 గంటల ముందు సుతక్ కాలం ప్రారభమవుతుంది. భారత్ లో సూర్య గ్రహణం కనిపించదు. అందుకే సుతక్ కాలం కూడా చెల్లదు. పశ్చిమాసియా, నైరుతి ఐరోపా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్ మహా సముద్రం, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువాల్లో తొలి సూర్యగ్రహణం కనిపిస్తుంది.