రాహువు, శుక్ర కలయిక వల్ల మరికొన్ని రాశులకి కాస్త ఇబ్బందులు ఎదురుకాబోతున్నాయి. కుంభం, మీనం, వృశ్చిక రాశి వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఇంట్లో కలహాల వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ధన నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. జీవిత భాగస్వామితో వివాదాలు తలెత్తే ప్రమాదం ఉంది.