ఫిబ్రవరిలో గ్రహాల యువరాజు బుధుడు, కుజుడు, శుక్రుడు తమ రాశి చక్రం మార్చుకోబోతున్నాయి. బుధుడు, శుక్రుడు, కుజుడు మూడు గ్రహాలు మకర రాశిలోకి ప్రవేశించబోతున్నాయి. ఇప్పటికే ఇక్కడ సూర్యుడు సంచరిస్తున్నాడు. మూడు గ్రహాల కలయిక వల్ల త్రిగ్రాహి యోగం కూడా ఏర్పడబోతుంది. బుధుడు శుభ స్థానంలో ఉంటే ఆ వ్యక్తి వృత్తి, వ్యాపారాల్లో లాభం పొందుతారు. అలాగే శుక్రుడు శుభ స్థానంలో ఉంటే డబ్బుకు ఎటువంటి కొదువ ఉండదు. అంగారకుడు ధైర్యం, పరాక్రమానికి ప్రతీకగా ఉంటాడు. మకర రాశిలో ఈ గ్రహాల కలయిక ఏ రాశుల వారికి అదృష్టంగా పరణమించబోతుందో తెలుసుకుందాం. అందులో మీ రాశి ఉందో లేదో చూసుకోండి.