ఈ రోజునే తల్లులందరూ ‘స్తనవృద్ధి గౌరీ వ్రతం’ అని కూడా జరుపుకుంటారు. తల్లులు తమ సంతానానికి తల్లిపాలకి లోటు రాకుండా అమ్మవారు అనుగ్రహిస్తుందని అపారమైన నమ్మకంతో ఈ వ్రతం ఆచరిస్తూ జగన్మాతను అన్నపూర్ణా దేవిగా కొలుస్తారని చిలకమర్తి తెలిపారు. మనమందరమూ కూడా దేవీ నవరాత్రులలో అమ్మవారిని అన్నపూర్ణాదేవి అలంకారంలో ఆరాధించి, ఆమెను ప్రసన్నం చేసుకుని తరిద్దాము. అన్నపూర్ణ అష్టోత్తర నామాలు భక్తిగా ఉచ్చరిస్తూ, అన్నపూర్ణ స్తోత్రం పారాయణం చేసుకుంటూ, సమస్త ఉపచారాలు చేసి, దద్ధోజనాన్ని, కట్టె పొంగలిని నివేదిద్దామని చిలకమర్తి తెలిపారు. ఈరోజు ధరించాల్సి రంగు గంధం అని ఆధ్యాత్మికవేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.