Mothers day 2024: ఈ సృష్టిలో అమ్మ ప్రేమను మించింది మరొకటి లేదు. ప్రతి ఒక్కరికి తొలి గురువు అమ్మ. పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని నిరంతరం కలలు కనే వ్యక్తి అమ్మ. మన జీవితాలను తీర్చిదిద్దిన అద్భుతమైన అమ్మని సత్కరిస్తూ గౌరవంగా జరుపుకునే రోజు మదర్స్ డే.
ఈ ఏడాది మదర్స్ డే మే 12వ తేదీ వచ్చింది. ఈ మదర్స్ డే రోజు మీ తల్లి రాశి ప్రకారం ఈ ప్రత్యేకమైన గిఫ్ట్స్ ఇవ్వండి వాళ్ళు మురిసిపోతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి సొంత ప్రత్యేక లక్షణాలు, ప్రాధాన్యతలు ఉంటాయి. వాటి ఆధారంగా బహుమతులు ఇచ్చి అమ్మని సర్ ప్రైజ్ చేయండి.
మేష రాశి
ఈ రాశి లో జన్మించిన వారికి శక్తివంతమైన, సాహసోపేత స్ఫూర్తి కలిగి ఉంటారు. అందుకే వారికి ఫిట్నెస్ క్లాస్ కి సంబంధించిన సబ్‌స్క్రిప్షన్, అవుట్ డోర్ అడ్వెంచర్ ట్రిప్స్ వంటి వాటిని బహుమతిగా అందించండి. వారిని ఉత్సాహపరిచేందుకు అహ్లాదకరంగా ఉండే ప్రదేశాలకు ప్లాన్ చేస్తే అమ్మ చాలా సంతోషిస్తుంది.
వృషభ రాశి
వృషభ రాశి తల్లులు జీవితంలో సౌకర్యం, విలాసాలకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. అందువల్ల అటువంటి వారికి స్పా డే, ఖరీదైన నగలు, నోరూరించే కమ్మని ఆహారం ఏర్పాటు చేయండి. ఆ బహుమతులు చూసి మురిసిపోతారు.
మిథున రాశి
మిథున రాశి తల్లులకు ప్రేమ ఎక్కువ. మనసును ఉత్తేజపరిచే బహుమతులు వారికి అందించాలి. ఇష్టమైన పుస్తకాలు ఇచ్చారంటే మురిసిపోతారు. లేదంటే మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ, పుస్తకాలకు సంబంధించిన ఈవెంట్స్ కి తీసుకువెళ్లండి. వాళ్ళు చాలా సంతోషిస్తారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి తల్లులు చాలా సెంటిమెంట్ గా ఉంటారు. కుటుంబానికి ఎక్కువ విలువ ఇస్తారు. అందుకని కుటుంబంతో కలిసి ఉన్న ఫోటో ఆల్బమ్ లేదా వంశ వృక్షానికి సంబంధించిన జ్ఞాపకార్థం ఏదైనా బహుమతిగా ఇస్తే చక్కగా ఉంటుంది. అలాగే ఇంట్లో మీరు స్వయంగా వారికి వండి పెడితే తల్లి మనసు తృప్తి పడుతుంది.
సింహ రాశి
సింహ రాశి తల్లులు వ్యక్తిత్వాన్ని ప్రతిపాదించే బహుమతులు ఎక్కువగా నచ్చుతాయి. అందువల్ల వాళ్లకి స్టైలిష్ హ్యాండ్ బ్యాగ్స్ లేదా దుస్తులు, ఆభరణాలు వంటివి తీసుకోవచ్చు. విహారయాత్రకు ప్లాన్ చేసి వాళ్ళని సర్ ప్రైజ్ చేయవచ్చు.
కన్యా రాశి
కన్యా రాశి తల్లులు ప్రతి విషయంపై ఎక్కువ శ్రద్ధ చూపించేందుకు ఇష్టపడతారు. అందుకనే వాళ్ళకి హై క్వాలిటీ స్టేషనరీస్ ఎటువంటివి బహుమతిగా ఇస్తే బాగుంటుంది. అలాగే డిఫ్యూజర్ వంటివి ఇస్తే ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆమెకు విశ్రాంతిని ఇచ్చినవాళ్లు అవుతారు.
తులా రాశి
తులా రాశి తల్లులు అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందువల్ల అద్భుతమైన ఫోటో ఫ్రేమ్ లేదా అందమైన పూలతో ఉన్న సౌందర్య సాధనాలు వంటివి బహుమతిగా ఇవ్వండి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి తల్లులకు గంభీరమైన స్వభావం ఉంటుంది. స్టోన్ నెక్లెస్ వంటి నగలు లేదా వాళ్ళు జీవితంలో కొనుక్కోవాలని అనుకొని కొనుక్కోలేని వస్తువులు ఏవైనా ఇచ్చి సర్ ప్రైజ్ చేయండి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి తల్లులు సాహసోపేతంగా ఉంటారు. కొత్త విషయాలను తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. అందువల్ల ఇటువంటి వారికి ట్రావెల్ వోచర్ లేదా అడ్వెంచర్ కి సంబంధించి ఏమైనా బహుమతులు ఇవ్వాలి.
మకర రాశి
మకర రాశి తల్లులు సంప్రదాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. అందుకే వాళ్ళకి క్లాసిక్ పాటలు ఉన్నవి, సాహిత్యంతో కూడిన పుస్తకాలు ఇస్తే నచ్చుతుంది.
కుంభ రాశి
కుంభ రాశి తల్లులు ప్రగతి శీలులుగా ఉంటారు. మానవతా దృక్పథంతో ఉంటారు. ఆమె పేరు మీద ఒక స్వచ్ఛంద సంస్థకు విరాళం ఇచ్చారంటే అమ్మ మనసు సంతోషిస్తుంది.
మీన రాశి
మీన రాశి తల్లులు సానుభూతి గలవారు. ఆధ్యాత్మిక ప్రపంచంతో లోతైన సంబంధం కలిగి ఉంటారు. ధ్యానం, పుణ్యక్షేత్రాలు, తీర్థ యాత్రలకు సంబంధించి ఏదైనా ట్రిప్ ప్లాన్ చేయండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.