ఫిబ్రవరి 14 న గురు, చంద్రుల కలయికతో గజకేసరి యోగం ఏర్పడుతుంది. అలాగే కుంభ రాశిలో శని సంచారం వల్ల శశ యోగం, మకర రాశిలో కుజుడి సంచారం వల్ల రుచక యోగం ఏర్పడుతుంది. దీని వల్ల ఈరోజు ప్రాముఖ్యత మరింత పెరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత శశ, రుచక, గజకేసరి యోగం కలిసి వచ్చాయి. రుచక యోగం వల్ల ఆస్తి, సంపద పెరుగుతుంది. ఈ యోగం వల్ల కెరీర్ లో కూడా మంచి విజయాలు సాధిస్తారు.