మేష రాశిలో ఇప్పటికే ఇప్పటికే దేవగురువు బృహస్పతి కూడా ఉన్నాడు. మేష రాశిలో గురు, చంద్రులు కలిసి గజకేసరి రాజయోగం ఏర్పరుస్తున్నారు. మత విశ్వాసాల ప్రకారం జాతకంలో గజకేసరి రాజయోగం ఉంటే సంపద, ఆనందం, అదృష్టాన్ని పెంచుతుంది. జాతకులు ధన సమస్యల నుంచి బయటపడతారు. ఈ రాజయోగం ప్రభావంతో ఒక వ్యక్తి జ్ఞానవంతుడు, ధనవంతుడు అవుతాడు. లక్ష్మీదేవి ఆశీస్సులు పొందుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గజకేసరి యోగం మేష రాశి వారితో పాటు మరికొన్ని రాశుల వారికి మేలు చేస్తుంది.