Gaja kesari yogam: జ్యోతిష లెక్కల ప్రకారం గ్రహాలు నిర్ణీత విరామం తర్వాత రాశి చక్రాన్ని మార్చుకుంటాయి. 2024 సంవత్సరంలో దేవగురువు బృహస్పతి మే 1వ తేదీ వరకు మేష రాశిలో సంచరిస్తాడు. మార్చి 13న చంద్రుడు మేష రాశిలో సంచరిస్తాడు. దీని వల్ల గురు, చంద్రుల కలయికతో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ రాజయోగం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ యోగం ప్రభావం వల్ల జీవితంలోని ప్రతి పనిలో అదృష్టం వెన్నంటే ఉంటుంది. సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి.