చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య నాడు ఏం చేయాలి?
- చొల్లంగి అమావాస్య నాడు విష్ణుమూర్తి వైద్య వీర రాఘవస్వామిగా అవతరించారు. అందుకని ఈరోజు అనారోగ్య సమస్యల నుంచి బయట పడడానికి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉపశమనం పొందడానికి పూజ చేయడం మంచిది.
- ఈ స్వామివారి విగ్రహం మీ దగ్గర లేనట్లయితే విష్ణుమూర్తిని కూడా ఆరాధించవచ్చు.
- చొల్లంగి అమావాస్య నాడు నదీ స్నానం చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.
- పితృదేవతలకు తర్పణాలు కూడా ఇవ్వచ్చు.
- చొల్లంగి అమావాస్యనాడు ఎవరైతే ఇంట్లో అనారోగ్య సమస్యతో బాధపడతారో వారి కోసం వెండి కడియాన్ని పూజలో పెట్టి, ఆ తర్వాత వాళ్ళు దానిని ధరించినట్లయితే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
- ఈ అమావాస్య నాడు లక్ష్మీ సమేత విష్ణుమూర్తిని ఆరాధించడం మంచిది.
- లక్ష్మీ సహస్రనామం, విష్ణు సహస్రనామం పారాయణ చేస్తే మంచి జరుగుతుంది.
- తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోవచ్చు. తులసి కోట దగ్గర ముగ్గు వేసి లక్ష్మీ సమేత విష్ణుమూర్తి చిత్రపటాన్ని పెట్టి ఎర్రటి పూలమాలను వేసి ఆరాధించాలి. ఇలా చేయడం వలన విష్ణువు అనుగ్రహాన్ని అమితంగా పొందవచ్చు.
- ఈ రోజున అసత్యం పలకరాదు.
- మౌనంగా ఉండడం మంచిది. కుటుంబ పెద్దలను, స్త్రీలని, పిల్లలను ఈరోజు బాధించకూడదు.
- ఈరోజు పగటిపూట నిద్రపోకూడదు.
- రావి చెట్టు చుట్టూ ‘నారాయణ నమః’ అంటూ 27 సార్లు ప్రదక్షిణలు చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. అలాగే అక్కడ దీపారాధన చేసి విష్ణు అష్టోత్తరం చదువుకోవచ్చు.
- నల్ల నువ్వులు, వస్త్రం, ఉసిరికాయని దానం చేస్తే ఈరోజు చాలా మంచిది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.