జేఈఈ మెయిన్ సెషన్ 1 పేపర్ 2 ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?
- JEE Mains Session 1 paper 2 results ను ఎన్టీఏ జేఈఈ అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in కి వెళ్లండి.
- హోమ్ పేజీలో కనిపిస్తున్న “JEE (Main) B.Arch B.Planning session 1: Click here to download the score card” యాక్టివేటెడ్ లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు, మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయండి.
- సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
- మీ జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 పేపర్ 2 ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.
- ఫలితాలను సేవ్ చేసి భవిష్యత్తు రిఫరెన్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి.
జేఈఈ మెయిన్ సెషన్ 1 వివరాలు..
జేఈఈ మెయిన్ పరీక్ష అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో జరిగింది. భారత్ వెలుపల మనామా, దోహా, దుబాయ్, ఖాట్మండు, మస్కట్, రియాద్, షార్జా, సింగపూర్, కువైట్ సిటీ, కౌలాలంపూర్, లాగోస్/అబుజా, కొలంబో, జకార్తా, మాస్కో, ఒట్టావా, పోర్ట్ లూయిస్, బ్యాంకాక్, వాషింగ్టన్ డీసీలలో ఈ పరీక్షను నిర్వహించారు. అబుదాబి, హాంకాంగ్, ఓస్లోలో తొలిసారిగా నిర్వహించారు.