Indian Oil Corporation Limited Apprentice Recruitment: ముంబయిలోని అతిపెద్ద భారత ప్రభుత్వ రంగ సంస్థ- ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), మార్కెటింగ్ డివిజన్- కింద పేర్కొన్న విభాగాల్లో ట్రేడ్, టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీబీఏ, బీఏ, బీకాం, బీఎస్సీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 16 నుంచి జనవరి 5 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు..
* అప్రెంటిస్ పోస్టులు
మొత్తం ఖాళీలు: 1816.
➥ ట్రేడ్ అప్రెంటిస్
➥ టెక్నీషియన్ అప్రెంటిస్
➥ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్/ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్
రాష్ట్రాలవారీగా ఖాళీలు: తమిళనాడు & పుదుచ్చేరి-30, కర్ణాటక-20, మహారాష్ట్ర-252, గుజరాత్-95, గోవా-06, మధ్యప్రదేశ్-52, ఛత్తీస్‌గఢ్-24, డామన్ & డయ్యూ-03, దాద్రా & నగర్ హవేలీ-02, పశ్చిమ్ బెంగాల్-252, బిహార్-87, ఒడిశా-87, ఝార్ఖండ్-41, అసోం-115, సిక్కిం-04, అండమాన్ & నికోబార్-05, త్రిపుర-06, నాగాలాండ్-03, మిజోరం-01, మేఘాలయ-01, మణిపూర్-04, అరుణాచల్ ప్రదేశ్-04, ఢిల్లీ-138, హరియాణా-82, పంజాబ్-76, చండీగఢ్-14, హిమాచల్ ప్రదేశ్-19, జమ్ము అండ్ కశ్మీర్-17, ఉత్తర్‌ప్రదేశ్-256, రాజస్థాన్-96, ఉత్తరాఖండ్-24.
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, మెషినిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, రిటైల్ సేల్స్ అసోసియేట్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రీషియన్, మెకానిక్స్.
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీబీఏ, బీఏ, బీకాం, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 30.11.2023 నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 16.12.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05.01.2024.
ALSO READ:
వెస్ట్ సెంట్రల్ రైల్వేలో 3,015 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు, ఈ అర్హతలుండాలి
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ – వెస్ట్ సెంట్రల్ రైల్వే (RRC WCR) పరిధిలోని డివిజన్/యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్ (ACT Apprentice) శిక్షణ కోసం నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 3015 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
రైట్స్ లిమిటెడ్‌లో 257 అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
గురుగ్రామ్(హరియాణా)లోని రైట్స్ లిమిటెడ్- ఏడాది అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజినీరింగ్/నాన్-ఇంజినీరింగ్), డిప్లొమా అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీచేయనున్నారు. సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తుకు అర్హులు. సరైన అర్హతలున్నవారు సంబంధిత వెబ్‌పోర్టల్‌ల ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. అభ్యర్థులు డిసెంబరు 20లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..