భారతీయ విద్యార్థులపై ప్రభావం పడుతోందా?
కెనడాలో 4,27,000 మంది భారతీయులు విద్యనభ్యసిస్తున్నారు. కాలేజీల పరిమితులు, ఖర్చులు, రీసెర్చ్ విద్యార్థులను ఇతర దేశాల వైపు నెట్టేస్తున్నాయి. అమెరికాను ఇష్టపడే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు విద్యార్థుల కంటే ఆస్ట్రేలియా, కెనడాకు వెళ్లే పంజాబ్, హరియాణా విద్యార్థులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారని ఎడ్యుకేషన్ కన్సల్టెంట్లు చెబుతున్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలైన అమృత్ సర్, జలంధర్, పాటియాలా, మొహాలీ, బర్నాలా, ఖన్నా, ముక్త్సర్, ఫిరోజ్ పూర్, ఫరీద్ కోట్ వంటి చిన్న పట్టణాలకు చెందిన విద్యార్థులు ఇప్పుడు ఐరోపా దేశాలకు వెళ్లేందుకు రుణాలు తీసుకుంటున్నారని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) చెబుతున్నాయి.