Homeప్రజా సమస్యలు40 ఏళ్ల కిందట ఐవీఎఫ్ చేసిన డాక్టర్ పై మెడికల్ రేప్ కేసు పెట్టిన జంట...

40 ఏళ్ల కిందట ఐవీఎఫ్ చేసిన డాక్టర్ పై మెడికల్ రేప్ కేసు పెట్టిన జంట – ఏం చేశాడంటే ?


Couple Welcomed Twin Girls Via IVF In 1986 Now They Are Suing The Doctor For Medical Rape: పిల్లలు పుట్టని జంటలకు ఐవీఎఫ్ అనేది గొప్ప ఆశాకిరణం. అందుకే 1978లో మొదటి సారి ఐవీఎఫ్ ప్రయోగం చేసిన తర్వాత కొంత కాలంలోనే ప్రపంచవ్యాప్తం అయిపోయింది. ఇప్పుడు సిటీల్లో ప్రతీ మెయిన్ రోడ్డులో ఐవీఎఫ్ సెంటర్లు కనిపిస్తున్నాయి. 

అయితే ఇలా ఐవీఎఫ్ చేసిన ఓ డాక్టర్ పై అమెరికాలో మెడికల్ రేప్ కేసు నమోదు అయింది. 1986లో ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కన్న జంట ఈ కేసు పెట్టింది. హాయిగా పిల్లల కలను నెరవేర్చుకుని ఇంత కాలం తర్వాత ఎందుకు కేసు పెట్టారన్నది ఆసక్తికరం. ఆ డాక్టర్ అప్పుడే ఓ తప్పు చేశారని ఇప్పుడు తేలింది మరింది.    

అమెరికా మీడియా ప్రకటించిన వివరాల ప్రకారం కాలిఫోర్నియాకు చెందిన జేన్, జాన్ రాయ్ దంపతులు తమకు పిల్లలు పుట్టడం లేదని ఓ ఆస్పత్రిని సందర్శించారు. 1983లో వారిని పరిశీలించిన డాక్టర్ పిల్లలు పుట్టే చాన్స్ లేదని ఐవీఎఫ్ ద్వారా ప్రయత్నించాలని సలహా ఇచ్చారు. అప్పటికే ఐవీఎఫ్ ప్రపంచంలో సంచలనంగా మారింది. దాంతో ఆ జంట అంగీకరిచారు. మొదటి సారి ఐవీఎఫ్ చేయించుకున్నప్పుడు ట్విన్స్ పుట్టారు. అయితే వారు ఒక్క రోజులో చనిపోయారు. దీంతో ఆ జంట నిరాశనిస్పృహలకు గురయ్యారు. తర్వాత డాక్టర్ వారికి ధైర్యం చెప్పి కొంత విరామం తర్వాత రెండో సారి ఐవీఎఫ్ చేశారు. ఆ ప్రయోగం సక్సెస్ అయింది. మళ్లీ వారికి ట్విన్స్ పుట్టారు. దాంతో వారు హ్యాపీ లైఫ్ గడిపారు. 

Also Read:  ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం – మోడల్ సాహసం – యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో

అయితే ఇటీవల ఆ ఇద్దరు పిల్లల్లో ఒకరికి ఎందుకో డౌట్ వచ్చింది. తన బయలాజికల్ తల్లిదండ్రులు వీళ్లా కాదా అని తెలుసుకోవాలనుంది. వెంటనే డీఎన్ఏ టెస్టులు చేయించుకున్నారు. తల్లి డీఎన్‌ఏతో సరిపోలింది కానీ తండ్రి డీఎన్ఏతో సరిపోలలేదు. దాంతో ఆ తల్లి, కూతుళ్లు హతాశులయ్యారు. వెంటనే అప్పట్లో ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్ ను సంప్రదించారు. తాను వీర్యకణాలను మార్చానని ఆయన చెప్పడంతో షాక్ కు గురయ్యారు. 

మామూలుగా ఐవీఎఫ్ ప్రక్రియలో మహిళల నుంచి ముందుగా అండాలను సేకరిస్తారు. మగవారి నుంచి వీర్యాన్ని సేకరిస్తారు. ల్యాబ్ లో ఫలదీకరించి తర్వాత మహిళ గర్భంలోకి ప్రవేశ పెడతారు.  మహిళ అండాలు లేదు మగవారి వీర్యంలలో ఏదైనా సక్సెస్ కాదు అనుకుంటే.. దాతలవి కలుపుతారు. అయితే ఇది ఖచ్చితంగా వారి అనుమతితోనే జరగాల్సి ఉంది. ఇక్కడ ఏమీ చెప్పకుండా వీర్యాన్ని మార్చేసి ఐవీఎఫ్ చేసేశాడు డాక్టర్. విషయం తెలిసే సరికి ఆయనపై మెడికల్ రేప్ కేసు నమోదు అయింది. ఇలా చేయడాన్ని అమెరికాలో మెడికల్  రేప్ గా కేసు పెడతారు. అదే కేసు పెట్టారు. 

Also Read:  భారతీయులకు గుడన్యూస్.. ఇక నుంచి వీసా లేకుండానే రష్యాకు వెళ్లొచ్చట

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments