New Jersey 5th grade teacher accused of abusing boy giving birth to his child: అమెరికాలోని న్యూజెర్సీలో లారా కారెన్ అనే ఇరవై తొమ్మిదేళ్ల ఫిఫ్ గ్రేడ్ టీచర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను అరెస్టు చేసిన కారణం మాత్రం న్యూజెర్సీని షాక్ కు గురి చేసింది. ఆమె తాను పాఠాలు చెప్పే ఓ పిల్లవాడిలోబర్చుకుని శృంగారం చేసేది. అంతే కాదు అతని బిడ్డకు తల్లి అయింది. ఆ పిల్లవాడికి పదొకండేళ్ల వయసు నుంచే లారా కారెన్… ఆ విద్యార్థిని బుట్టలో వేసుకుందని గుర్తించారు.
లారా కారెన్ కు పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో ఆమె బయట పెట్టలేదు. కానీ ఇలా చిన్నారిని.. తాను చదువు చెప్పే చిన్న పిల్లవాడిని తండ్రిని చేస్తుందని ఎవరూ అనుకోలేదు. టీచర్ గా పని చేస్తూనే ఆ విద్యార్థి తల్లిదండ్రులతో లారా కారెన్స్ స్నేహం చేసింది. ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా మారారు. అప్పుడప్పుడు ఆ విద్యార్థిని టీచర్ ఇంట్లోనే వదిలి వెళ్లేవారు.ఆ చిన్న పిల్లవాడితో అలాంటి బంధాన్ని టీచర్ అయిన లారా పెట్టుకుంటుందని ఎవరూ ఊహించలేకపోయారు.
NEW: New Jersey school teacher arrested for allegedly having a child with a 13-year-old student who was living in her home.
The relationship began when teacher Laura Caron was about 26 years old and the child was 11.
In December, the victim’s father noticed that the child… pic.twitter.com/YgGS38LYtt
— Collin Rugg (@CollinRugg) January 16, 2025
ఇదంతా జరిగి ఐదేళ్లు అవుతోంది. 2019లో లారా కారెన్స్ బిడ్డను కన్నారు. విషయం కూడా విచిత్రంగా బయటపడింది టీచర్ కు పుట్టిన బిడ్డకుతండ్రి ఎవరో తెలియదు కాని బాలుడి పోలికలే ఉన్నాయి. దాంతో ఆ బాలుడి తండ్రిని అందరూ అనుమానంగా చూసేవారు. ఏ పాపం తెలియని ఆ బాలుడి తండ్రి.. ఓ సారి.. ప్రైవేటుగా తన కుమారుడితో మాట్లాడారు. మాటల్లో పెట్టి అసలేం జరిగిందో తెలుసుకున్నారు. అప్పుడు ఆ బాలుడు.. తన టీచర్ పుట్టిన బిడ్డకు తానే తండ్రినని చెప్పాడు. టీచర్ తనను ఫిజికల్ గా ఎలా ఉపయోగించుకుందో చెప్పడంతో ఆ తండ్రి హతాశుడయ్యాడు.
ఆ బాలుడి సోదరి కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. తన సోదరుడితో టీచర్ విచిత్రంగా ప్రవర్తిస్తూండటాన్ని చూశానని స్టేట్ మెంట్ ఇచ్చారు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు టీచర్ లారా కారెన్స్ పై మైనర్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసును పెట్టి అరెస్టు చేశారు.
మరిన్ని చూడండి