Ram Mandir’s 1st Anniversary : ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం రామమందిరం మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హిందువుల విశ్వాసం, భక్తి, పట్టుదలకు స్మారక చిహ్నంగా నిలిచే ఈ పవిత్ర క్షేత్రం ప్రాణ ప్రతిష్టను పూర్తి చేసుకుని ఈ రోజుతో సంవత్సరం పూర్తయింది. జనవరి 22, 2024న ప్రారంభించిన ఈ ఆలయం భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. ఈ గొప్ప వేడుకకు అప్పట్లో అనేక మంది భక్తులు, ప్రముఖులు హాజరయ్యారు. కాగా ఇప్పుడు వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తున్నారు.
11రోజుల ముందుగానే ఎందుకంటే..
అయితే, రామమందిరంను గతేడాది జనవరి 22న నిర్వహించారు. మరి ఈ ఏడాది మాత్రం జనవరి 11న ఎందుకు జరుపుకుంటారని చాలా మందిలో మెదలాడుతోన్న ప్రశ్న. అయితే ఈ మార్పుకు ఓ కారణముంది. అదేంటంటే హిందూ పంచాంగం ప్రకారం, అధికారికంగా ఆలయ పవిత్రతను గుర్తించే ప్రతిష్ఠ మహోత్సవం లేదా పవిత్రోత్సవం జనవరి 11, 2024న జరిగింది. ఆలయ ప్రారంభోత్సవం జరిగిన ఈ తేదీకి చాలా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా హిందూ పండుగలు, వేడుకలను చంద్రమానం క్యాలెండర్ ప్రకారం నిర్ణయిస్తారు. అప్పట్లో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట పుష్య శుక్లపక్ష ద్వాదశి నాడు జరిగింది. అంటే పుష్య మాసంలో చంద్రుడు 12వ రోజుకు అడుగుపెట్టిన నాడు జరిగిందన్నమాట. ఈ లెక్కన 2024లో జనవరి 22న ఈ పుష్య శుక్లపక్ష ద్వాదశి వచ్చింది. కానీ అదే హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సారి 2025లో జనవరి 11న వచ్చింది. అందుకే 11 రోజుల ముందుగానే అంటే జనవరి 11న అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
వార్షికోత్సవ వేడుకల కోసం, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనవరి 11, 2025న వచ్చే పుష్య శుక్ల ద్వాదశి నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎంచుకుంది. ఈ నిర్ణయం సాంప్రదాయ హిందూ ఆచారానికి అనుగుణంగా ఉంది. జనవరి 11 నుండి జనవరి 13, 2025 వరకు జరిగే ఈ వేడుకలలో వివిధ రకాల ఆచారాలు, ప్రార్థనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తులు, సాధువులు రాముడిని కొలుస్తూ, రామమందిరం ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తూ ఈ కార్యకలాపాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది.
దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు
అయోధ్య రామ మందిరం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. శతాబ్దాల త్యాగం, తపస్సు, పోరాటం ఫలితంగా రూపొందిన ఈ ఆలయం మన సంస్కృతి, ఆధ్యాత్మికతకు గొప్ప వారసత్వం అని అన్నారు. ఈ దివ్యమైన, అద్భుతమైన రామాలయం విక్షిత్ భారత్ సంకల్పాన్ని సాకారం చేసుకోవడంలో ప్రధాన ప్రేరణగా పనిచేస్తుందని విశ్వసిస్తున్నానంటూ మోదీ రాసుకొచ్చారు.
अयोध्या में रामलला की प्राण-प्रतिष्ठा की प्रथम वर्षगांठ पर समस्त देशवासियों को बहुत-बहुत शुभकामनाएं। सदियों के त्याग, तपस्या और संघर्ष से बना यह मंदिर हमारी संस्कृति और अध्यात्म की महान धरोहर है। मुझे विश्वास है कि यह दिव्य-भव्य राम मंदिर विकसित भारत के संकल्प की सिद्धि में एक… pic.twitter.com/DfgQT1HorT
— Narendra Modi (@narendramodi) January 11, 2025
మరిన్ని చూడండి