Saif Ali Khan property : బాలీవుడ్ హీరోసైఫ్ అలీ కాన్ సాదా సీదా వ్యక్తి కాదు. రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. పటౌడీ వారసుడు. సైఫ్ అలీఖాన్ తండ్రి మన్సూర్ అలీ ఖాన్ క్రికెటర్. ఆయన పటౌడీ వంశానికి వారసుడు. ఆయన చనిపోయిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ వారసుడు అయ్యారు. 2011లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ మరణం తర్వాత సైఫ్‌కి భోపాల్ నవాబ్ బిరుదుతో తలపాగా ఉత్సవం కూడా ఘనంగా జరిపించారు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పటౌడీ కుటుంబానికి ‘ఫ్లాగ్ హౌస్’ ఉంది. అలాగే నూర్ ఉస్ సాభా ప్యాలెస్, దార్ ఉస్ సలాం, హబిబి బంగ్లా, అహ్మదాబాద్ ప్యాలెస్, కొఫేజా ప్రాపర్టీ సహా భోపాల్‌లోని పటౌడీ కుటుంబానికి మొత్తం పదిహేను వేలకోట్ల విలువైన ఆస్తి ఉంది. అయితే ఇది వివాదాల్లో ఉంది. దేశ విభజన సమయంలో ఇక్కడ ఆస్తుల్ని వదిలి పెట్టి పాకిస్తాన్ వెళ్లిపోయిన వారి ఆస్తుల్ని ఎనిమీ ప్రాపర్టీ కింద పరిగణించి కేంద్రం స్వాధీనం చేసుకుంటుంది. ఎనిమీ ప్రాపర్టీ చట్టాన్ని 1968లో రూపొందించారు.
పటౌడీ వంశానికి చెందిన భోపాల్ చిట్టచివరి నవాబ్ హమీదుల్లా ఖాన్‌కు ముగ్గురు కుమార్తెలు. ఖాన్ ఆస్తికి చట్టబద్ధ వారసురాలు ఆయన పెద్ద కూతురు అబిదా . ఆమె 1950లో పాక్‌కు వలస వెళ్లిపోయారు. కాబట్టి ఇది ఎనిమీ ప్రాపర్టీ అని కేంద్రం గుర్తించింది. అయితే హమీదుల్లా ఖాన్ రెండో కుమార్తె సాజిదా సుల్తాన్ వారసులు సైఫ్ అలీ ఖాన్, షర్మిలా ఠాగూర్ న్యాయపోరాటం ప్రారంభించారు. అప్పట్లో కేంద్రం స్వాధీనం చేసుకోకుండా భోపాల్ కోర్టు స్టే ఇచ్చింది. తాజాగా భోపాల్ చారిత్రక రాచరిక రాష్ట్రాల ఆస్తులపై 2015 నుంచి ఉన్న స్టేను కోర్టు ఎత్తేసింది. ఈ కేసులో అప్పీలేట్ అథారిటీ ముందు తమ వాదనలను వినిపించాలని సైఫ్ అలీ ఖాన్, అయన తల్లి షర్మిలా ఠాగూర్, సోదరీమణులు సోహా, సబా అలీ ఖాన్, పటౌడీ సోదరి సబీహా సుల్తాన్‌లను హైకోర్టు ఆదేశించింది.
Also Read: సిజేరియన్లకు పరుగులు పెడుతున్న ప్రెగ్నెంట్ మహిళలు – పిల్లలకు పౌరసత్వం కోసం అమెరికాలో కొత్త హడావుడి !
కానీ పటౌడీ కుటుంబం చురుగ్గా స్పందించలేదు. తమ వారసత్వ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా డివిజన్ బెంచ్‌లో ఈ ఉత్తర్వులను సవాలు చేయడమే పటౌడీ కుటుంబానికి మిగిలి ఉన్న ఏకైక మార్గమని న్యాయనిపుణులు చెబుతుననారు. 2019లో సాజిద్ సుల్తాన్‌ను చట్టబద్దమైన వారసురాలిగా కోర్టు గుర్తించింది. దాంతో ఆస్తులు వీరి సొంతమవ్వాలని కానీ న్యాయపరమైన చిక్కులువస్తున్నాయి. ఈ లీగల్ బ్యాటిల్ కోల్పోతే సైఫ్ కోల్పోయే మొత్తం చిన్నది కాదు. అందుకే పాపం సైఫ్ అంటున్నారు ఫ్యాన్స్.
మరిన్ని చూడండి