Did Sania Mirza tie the knot again after Shoaib Malik married Sana Javed : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు.. క్రికెటర్ షోయుబ్ మాలిక్ ట్రిపుల్ తలాక్ ఇచ్చి సనా జావెద్ అనే నటిని మూడో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు సానియా మీర్జా కూడా ఉమైన జస్వాల్ అనే పాకిస్తాన్ నటుడు, సింగర్ ను రెండో పెళ్లి చేసుకుందన్న ప్రచారం ఒక్క సారిగా ప్రారంభమయింది. దీనికి కారణం ఉమైర్ జస్వాల్ పెళ్లి దుస్తుల్లో చేసిన ఓ ఇన్ స్టా పోస్టే.
హుదూద్ కంటే వంద రెట్ల విధ్వంసం సృష్టించిన మిల్టన్ – ఫ్లోరిడా పరిస్థితి ఎలా ఉందో చూశారా ?
నిజానికి ఉమైర్ జస్వాల్, సానియా మీర్జా ఎక్కడైనా కలిశారా లేదా అన్నది ఎవరికీ తెలియదు. వారు కలిసినట్లుగా ఒక్క ఫోటో కూడా లేదు. అయినా ఏకంగా పాకిస్థాన్ సోషల్ మీడియా పెళ్లి చేసేసింది. దానికి కారణం ఒకే ఒక్క లింక్. అదేమిటంటే.. ఈ ఉమైర్ జస్వాల్ ఎవరో కాదు. సానియాకు విడాకులు ఇచ్చిన తర్వాత షోయుబ్ మాలిక్ చేసుకున్న సనా జావెద్ అనే నటి మాజీ భర్త. మాలిక్ పరిచయమయ్యే వరకూ జస్వాల్ తోనే గడిపిన సనా జావెద్ ఆ తర్వాత ట్రిపుల్ తలాక్ చెప్పించుకుని మాలిక్ కు దగ్గరయింది. ఉమైర్ జస్వాల్ మాత్రం ఒంటరిగా ఉండిపోయాడు.
అలాంటి ఉమైర్ జస్వాల్ తాజాగా పెళ్లి దుస్తుల్లో ఫోటో పెట్టడంతో తన మాజీ భార్య సనా జావెద్, ఆమెను పెళ్లి చేసుకున్న షోయుబ్ మాలిక్‌లకు షాక్ ఇచ్చేందుకు సానియా మీర్జానే పెళ్లి చేసుకున్నారని పాకిస్తాన్ సోషల్ మీడియా కథకలు కొత్త కథలు వండి ప్రారంభించారు. ఇదేగో బాగుందని.. తన మాజీ భార్యకు..ఆమె ప్రస్తుత భర్తకు మానసికంగా వేధించడానికి పనికొస్తుదంని అనుకున్నాడేమో కానీ ఉమైర్ జస్వాల్ కూడా స్పందించలేదు.
మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా – క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్
ఇలాంటి రూమర్స్ కు స్పందిస్తే ఇంకా ఎక్కువ ప్రచారం జరుగుతుందన్న ఉద్దశంతో సానియా మీర్జా, ఆమె కుటుంబం ఇలాంటి వ్యక్తిగత విషయాలపై స్పందించడం మానేసింది. సానియా మీర్జా సోషల్ మీడియాలో అకౌంట్లలో ఎప్పుడూ ఉమైర్ జైస్వాల్ తో కలిసి ఉన్న ఫోటోలు పెట్టలేదు. తాజాగా మరో పెళ్లి గురించి కానీ.. వ్యక్తిగత జీవితానికి సంబంధించి కానీ ఎలాంటి పోస్టులు పెట్టలేదు.
మరిన్ని చూడండి