అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తమ రాష్ట్రానికి చెందిన వ్యక్తులను అక్రమంగా నిర్బంధించారని ఏకంగా ఎస్పీ, కలెక్టర్లకే ఫిర్యాదు అందింది. పశ్చిమ బెంగాల్ ఎంపీ స్వయంగా జిల్లా యంత్రాంగానికి మెయిల్ చేశారు.

రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తిపై ఫిర్యాదు రావడంతో ఒక్కసారిగా జిల్లాయంత్రాంగం అప్రమత్తమైంది. ఇంతకీ పశ్చిమబెంగాల్‌ ఎంపీ ఏహెచ్‌ ఖాన్‌ చౌదరి చేసిన ఆ ఫిర్యాదులో ఏముంది అంటే.. అనంతపురం రూరల్ మండలంలోని కొడిమి జగనన్న లేఅవుట్ కాలనీ కాంట్రాక్ట్‌ను పశ్చిమ బెంగాల్ వ్యక్తి సర్వర్‌ జహాన్‌కు ఇచ్చారు. ఆ పనులను సొంత రాష్ట్రం నుంచి కూలీలను తెప్పించి పనులు పూర్తి చేస్తున్నారు.

ఇంతలో కాంట్రాక్టర్‌కు బెదిరింపులు రావడం స్టార్ట్ అయ్యాయి. కాలనీ నిర్మిస్తున్నందుకు తమకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్స్ ఎక్కువ అయ్యాయి. వాటిని ఆయన పెద్దగా పట్టించుకోలేదు. చివరకు ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగి బెదిరింపులు తీవ్రం చేశారు. నేరుగా కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు.

అంతే కాకుండా డబ్బులు ఇవ్వలేదని స్థానిక పోలీసులకు చెప్పి కాంట్రాక్టర్‌ను అక్కడ పని చేసే కూలీలను అరెస్టు చేయించారు. అప్పటి నుంచి వాళ్ల సమాచారం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. బంధువులకు కూడా ఏ విషయం చెప్పడం లేదని వారంతా కంగారు పడుతున్నారు. ఇలా తీవ్ర ఆరోపణలతో ఎంపీ నుంచి జిల్లాయంత్రాంగం మెయిల్ అందుకుంది.

విచారణ చేసి నిర్బంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లాయంత్రాంగానికి ఎంపీ డిమాండ్ చేశారు. ఇందులో ఎమ్మెల్యే పేరు కూడా వినిపిస్తున్నందున వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీక్రెట్‌గా విచారించారు. అసలు ఏం జరిగిందో తెలుసుకున్నారు. మీడియాకు తెలియడంతో పోలీసులు మాత్రం మాట దాటవేస్తున్నారు. అలాంటి కిడ్నాప్‌లు ఏం జరగలేదని చెబుతున్నారు.

అయితే తమను బెదిరించిన ఫోన్ కాల్‌ లిస్టును కూడా ఉన్నతాధికారులకు ఎంపీ పంపించినట్టు తెలుస్తోంది. అన్ని ఆధారాలు ఉన్నందున నేరుగా జిల్లా కలెక్టర్‌కు లెటర్ రాశారు.

ఎమ్మెల్యే తోపుదుర్తి కూడా తనకు బెదిరింపుల సంగతే తెలియదని అంటున్నారు. అది రెండు సంస్థల మధ్య వివాదమని వాళ్లే తేల్చుకోవాలన్నారు. ఎమ్మెల్యేగా వారితో తనకేం పని అని ప్రశ్నిస్తున్నారు. సకాలంలో పని పూర్తి చేసి ఇవ్వాలని చెప్పి ఉంటానని వివరిస్తున్నారు.

Source link
వైసీపీ ఎమ్మెల్యేపై తోపుదుర్తిపై బెంగాల్ ఎంపీ ఫిర్యాదు- తమవారిని బంధించారని కలెక్టర్కు మెయిల్
RELATED ARTICLES