Man uses wife recorded conversations in divorce case gets Supreme Court heat: నా భార్య తప్పు చేస్తోంది.. నాకు విడాకులు కావాలని ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. విచారణ సందర్భంగా తన భార్య తప్పు చేస్తోందనడానికి సాక్ష్యంగా ఆడియో రికార్డింగులు సమర్పించాడు. అవి ఎక్కడి నుంచి వచ్చాయంటే.. తన భార్య ఫోన్ లో తాను రహస్యంగా ఓ యాప్ అమర్చానని దాని ద్వారా రికార్డు చేసి విన్నానని చెప్పాడు. దాంతో సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేయడం చట్ట ప్రకారం నేరం అని వాటిని సాక్ష్యాలుగా ఎలా పరిగణనలోకి తీసుకుంటామని ప్రశ్నించింది. ఇలా రికార్డు చేశాడంటే ఇతను ఎలాంటి భర్త అని జస్టిస్ నాగరత్న విస్మయం వ్యక్తం చేశారు.
ఈ ఆడియో రికార్డింగ్‌లను సాక్ష్యంగా తీసుకోవడంపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద గోప్యతా హక్కు, భారత సాక్ష్య చట్టంలోని నిబంధనల ప్రకారం పరిశీలన చేయాల్సిఉంది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లోని సెక్షన్ 122 యొక్క వర్తింపును కోర్టు పరిశీలిస్తుంది. ఈ సెక్షన్ కింద, జీవిత భాగస్వాముల మధ్య చట్టపరమైన వివాదంలో అలాంటి సంభాషణలను బహిర్గతం చేయడానికి అనుమతి ఉండదు. అయితే పిటిషనర్ తరపు లాయర్ మాత్రం డిజిటల్ ఎరాకు ముందు అని.. ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని వాదించారు. అయితే చట్టపరమైన మినహాయింపులతో గోప్యతా హక్కులకు కూడా ఇక్కడ ప్రాముఖ్యత ఉంటుందని జస్టిస్ నాగరత్న స్పష్టం చేశారు.
Also Read: పుప్పాలగూడ జంట హత్యల కేసు – నిందితుల్ని పట్టించిన సెల్ ఫోన్ సిగ్నల్స్ – హత్యలకు కారణాలివే!
గతంలో అనుమతి లేకుండా ఇలాంటి ఆడియో, వీడియో రికార్డులను సాక్ష్యాలుగా తీసుకోవడాన్ని పలు హైకోర్టులు ఆమోదయోగ్యం కాదని తీర్పులు చెప్పాయని గుర్తు చేశారు. అనేక హైకోర్టు తీర్పులు సెక్షన్ 122 కింద చట్టబద్ధమైన మినహాయింపులను పట్టించుకోకుండా గోప్యతా సమస్యలపై మాత్రమే దృష్టి సారించాయని జస్టిస్ నాగరత్న తెలిపారు. సంబంధిత సమస్యలను అధ్యయనం చేసి వివరణాత్మక నివేదికను సమర్పించే బాధ్యతను అమికస్ క్యూరీకి అప్పగించారు. ఈ విషయం ఫిబ్రవరి 18న తదుపరి విచారణకు రానుంది.
ఇక్కడ భార్య లేదా భర్త తప్పుడు పనులు చేస్తున్నారని నిర్ధారించడానికి నిఘా పెట్టడం, రికార్డింగులు చేయడండ నైతికంగా తప్పు అవుతుంది. కానీ చట్ట పరంగా అలాంటి సాక్ష్యలు చెల్లుతాయా లేదా అన్నది మాత్రం కీలకం. అమికస్ క్యూరీ ఇచ్చే నివేదికను బట్టి సుప్రీంకోర్టు ఇలాంటి సాక్ష్యాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇది నైతికత, చట్టపరమైన అంశాలకు సంబంధించినది కావడమే కాదు.. ఇలాంటి సాక్ష్యాల పరిగణనకు సంబంధించి కీలకమైన అంశంగా మారింది.
Also Read : Saif Ali Khan Case: తూచ్ .. సైఫ్ పై దాడి చేసింది ఆ వ్యక్తి కాదు – వదిలేసిన పోలీసులు – మరి ఎవరు ?
మరిన్ని చూడండి