Homeప్రజా సమస్యలువయనాడ్‌లో ప్రియాంక గాంధీ జయభేరి - రాహుల్ రికార్డ్ బ్రేక్ చేసి చారిత్రాత్మక గెలుపు

వయనాడ్‌లో ప్రియాంక గాంధీ జయభేరి – రాహుల్ రికార్డ్ బ్రేక్ చేసి చారిత్రాత్మక గెలుపు


Priyanka Gandhi Won In Wayanad By Election: తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఘన విజయం సాధించారు. కేరళ వయనాడ్ (Wayanad) లోక్ సభ ఉప ఎన్నికలో ఆమె భారీ విజయాన్ని అందుకున్నారు. బీజేపీ నేత, సమీప అభ్యర్థి నవ్య హరిదాస్‌పై 3.94 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానంలో తన సోదరుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) సాధించిన 3.64 లక్షల ఓట్ల మెజార్టీని ప్రియాంక దాటేసి రికార్డు సృష్టించారు. రెండో స్థానంలో కమ్యూనిస్టు అభ్యర్థి సత్యన్ మోకరి నిలిచారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ 10 వేల ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు.

కాగా, వయనాడ్‌లో 2019 లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ నేత పీపీ సునీర్‌పై 4.3 లక్షల మెజార్టీతో రాహుల్ గాంధీ విజయం సాధించారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో వయనాడ్ స్థానం నుంచి పోటీ చేసిన రాహుల్.. సీపీఐ నాయకురాలు అన్నీ రాజాపై 3.64 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాయ్‌బరేలీలోనూ విజయం సాధించడంతో ఆ తర్వాత ఆ స్థానాన్ని వదులుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం కాగా.. ప్రియాంక గాంధీ రంగంలోకి దిగారు. ఝార్ఖండ్ తొలి విడత ఎన్నికలతో పాటుగా ఈ నెల 13న ఇక్కడ పోలింగ్ జరిగింది.

Also Read: Maharastra Elections: ఆసలైన శివసేన, ఎన్సీపీలు ఏవో తేల్చేసిన మహారాష్ట్ర ప్రజలు – ఇక థాక్రే, పవార్‌లకు రాజకీయ సన్యాసమేనా ?

 

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments