Ramlala Pran Pratishtha:
ప్రధాని మోదీ భావోద్వేగం..
ఈ నెల 22వ తేదీన అయోధ్య ఉత్సవాన్ని (Ram Mandir Inauguration) వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకకు ముందుగా దాదాపు 11 రోజుల పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ క్రమంలోనే “అనుష్ఠానం” కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (Ram Mandir Pran Pratishtha) ప్రారంభించారు. ఈ మేరకు స్వయంగా మోదీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో వాయిస్ మెసేజ్‌ని అప్‌లోడ్ చేశారు. ఇలాంటి గొప్ప ఉత్సవాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఇదో చారిత్రక ఘటన (Ayodhya News) అంటూ ఆనందం వ్యక్తం చేశారు. దేశ ప్రజలందరూ తనను ఆశీర్వదించాలని కోరారు.
“అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి మరో 11 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ వేడుకను నా చేతుల మీదుగా జరగాలనే ఆ దేవుడు నాకీ జన్మ ఇచ్చినట్టున్నాడు. దేశ ప్రజలందరికీ ప్రతినిధిగా నేనీ ప్రాణప్రతిష్ఠ చేస్తాను. ఇవాళ్టి నుంచి 11 రోజుల పాటు పలు కీలక కార్యక్రమాలు జరుగుతాయి. అసలు ఈ ఘట్టాన్ని తలుచుకుంటేనే నేను భావోద్వేగానికి లోనవుతున్నాను. నా జీవితంలో ఇలాంటి అనుభూతి కలగడం ఇదే తొలిసారి”
– ప్రధాని నరేంద్ర మోదీ
జీవితంలో ఇలాంటి క్షణాలు చాలా అరుదుగా వస్తాయని, ఇదంతా ఆ దైవ సంకల్పమే అని భావోద్వేగానికి లోనయ్యారు ప్రధాని మోదీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులంతా ఉప్పొంగిపోయే సందర్భమని అన్నారు. ప్రతి చోటా రాముడే కనిపిస్తున్నాడని చెప్పారు.