Homeప్రజా సమస్యలుభారత నేవీ దళంలోకి మరో అస్త్రం

భారత నేవీ దళంలోకి మరో అస్త్రం


Unmanned Aerial Vehicle: భారత నేవీ (Indian Navy) దళంలోకి మరో అస్త్రం చేరబోతోంది. స్వదేశీ టెక్నాలజీతో దేశీయంగా తయారు చేసిన దృష్టి 10 ‘స్టార్‌లైనర్’ మానవరహిత ఏరియల్ వెహికల్‌‌ (UAV)ను అధికారులు ప్రారంభించనున్నారు. నేవీ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ (Chief of Naval Staff Admiral) ఆర్ హరి కుమార్ (R Hari Kumar) వాటిని ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లోని అదానీ ఏరోస్పేస్ పార్క్‌లో ఫ్లాగ్ ఆఫ్ వేడుక జరగనుంది.

రక్షణరంగంలో భద్రత, స్వయం ప్రతిపత్తి సాధించడం, ప్రపంచంతో పోటీ పడేలా అదానీ డిఫెన్స్, ఏరోస్పేస్ ఈ డ్రోన్లను నిర్మిస్తోంది. ఈ సంస్థ ఇప్పటికే సైన్యం, ఇతర పారామిలిటరీ బలగాలకు అనువైన చిన్న ఆయుధాలు, మానవరహిత వైమానిక వాహనాలు, రాడార్లు, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, ఏవియానిక్స్, టాక్టికల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఎలక్ట్రో-ఆప్టికల్ సిస్టమ్స్‌ను తయారు చేస్తోంది.

భారతదేశపు మొట్టమొదటి మానవరహిత వైమానిక వాహనాల తయారీ కేంద్రాన్ని అదానీ డిఫెన్స్ ప్రారంబించింది. ఇది భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రంగ చిన్న ఆయుధాల తయారీ కేంద్రం. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాల నిర్వహణ, మరమ్మతులు చేట్టేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రమాదకర డ్రోన్‌లను ఎదుర్కోవడానికి అదానీ డిఫెన్స్ రక్షణ, పౌర అవసరాల కోసం కౌంటర్ డ్రోన్ వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments