Bangladesh is gathering weapons to conspire against India: ప్రజాస్వామ్యం నుంచి పక్కకు వెళ్లిపోయి నోబెల్ శాంతి బహుమతి సాధించిన ఓ వ్యక్తి చేతిలో హింసాత్మక పాలనలో మగ్గతున్న బంగ్లాదేశ్ వినాశకరమైన ప్రయత్నాలు చేస్తోంది చైనా నుంచి ఆయుధాలను ఎక్కువగా సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది.తాజాగా చైనా నుంచి అత్యాధునిక యుద్ద విమానాలను కొనాలని నిర్ణయించుకుంది. ఓ వైపు పాకిస్తాన్ తో సంబంధాలు పెంచుకుంటోంది. ఆ దేశం నుంచి అణు సహకారం పొందే యోచనలో ఉందని చెబుతున్నారు. మరో వైపు చైనాకు ఇంకా దగ్గరవుతున్నారు. భారత్ ను రెచ్చగొట్టేందుకే ఇదంతా చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హసీనాను వెళ్లగొట్టిన దగ్గర నుంచి భారత్ పై కుట్రలు
ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైనా షేర్ హసీనాను దేశం నుంచి వెళ్లగొట్టి పాలనను చేజిక్కించుకున్నారు. ఇప్పుడు అక్కడ ప్రజా ప్రభుత్వం లేదు. ఎన్నికలు నిర్వహించాలన్న ప్రయత్నమే చేయకుండా మహమ్మద్ యూనస్ దేశాన్ని నడిపేస్తున్నారు. అప్పనంగా వచ్చిన కుర్చీని ఆయన నిలుపుకునేదుకు దేశాన్ని అస్థిర స్థితిలోకి నెట్టేస్తున్నారు. భారత్ తో శత్రుత్వం పెంచుకుంటున్నారు. దానికి కారణంగా షేక్ హసీనాకు ఆశ్రయమివ్వడాన్ని సాకుగా చూపిస్తున్నారు. కానీ ఆయన అజెండా వేరు అన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
Also Read: భారతీయులకు గుడన్యూస్.. ఇక నుంచి వీసా లేకుండానే రష్యాకు వెళ్లొచ్చట
పాకిస్తాన్ నుంచి అణుసహకారం కోరుతున్న బంగ్లాదేశ్
ఇటీవల పాకిస్థాన్‌తో బంగ్లాదేశ్ పరిచయాలు పెంచుకుంటోంది. గతంలో కాస్త దూరం పాటించేది.కానీ ఇప్పుడు పౌరులు యధేచ్చగా రెండుదేశాల మధ్య తిరిగేలా ఒప్పందాలు పునరుద్దరించుకున్నారు. పాకిస్తాన్ నుంచి ఎవరైనా తీవ్రవాదులు భారత్ పై కుట్ర చేయడానికి వస్తే రెడ్ కార్పెట్ వేస్తామని సంకేతాలు ఇచ్చారు. గతంలో ఇలాంటి వారు వస్తున్నారని ఆంక్షలు విధించారు. ఇప్పుడు తాము కూడా అణుదేశం అనిపించుకోవాలన్న లక్ష్యంతో పాకిస్తాన్ నుంచి సహకారం కోరుతోందని చెబుతున్నారు. అణ్వస్త్ర సామర్థ్యాన్ని బంగ్లాదేశ కు ఇచ్చే విషయంపై పాకిస్థాన్ లోనూ చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. అదే జరిగితే భారత్ పై అతి పెద్ద కుట్ర చేస్తున్నారని అనుకోవడానికి అవకాశం ఏర్పడుతోంది.
Also Read: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం – మోడల్ సాహసం – యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో
కొత్తగా ఆయుధాలిస్తున్న చైనా
బంగ్లాదేశ్ ఆర్థిక సామర్థ్యం పరిమితం. ఆయుధాలు కొనుగోలు చేసేంత గొప్ప బలమైన దేశం కాదు. అందుకే ఆయుధ సంపత్తి పరంగా ఆ దేశం బలహీనంగా ఉంటుంది. చైనా నుంచి ఎప్పటి నుంచి కొనాలనుకుంటున్న j-10సీ అనే ఫైటర్ జెట్లను తాజాగా కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. పూర్తిగా డబ్బులు కట్టకపోయినా వాయిదాల్లో అయినా కట్టుకోమని చెప్పి ఈ జెట్లను చైనా ఇస్తోంది. ఓ వైపు చైనా.. మరో వైపు పాకిస్తాన్ ఇలా బంగ్లాదేశ్ కు సహకరించడానికి కారణం భారత్ ను టార్గెట్ గా పెట్టుకోవడమేనని చెబుతున్నారు. అదే నిజం అయితే భారత్ కూడా రెడీగా ఉంటుందన్న సంకేతాలను ఇప్పటికే పంపారు.
మరిన్ని చూడండి