Homeప్రజా సమస్యలుపార్లమెంట్‌ శీతాకాల సమావేశాలకు రూ.84 కోట్లు ఖర్చు, ఆమోదం పొందిన బిల్లులెన్ని? వృథా రోజులెన్ని?

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలకు రూ.84 కోట్లు ఖర్చు, ఆమోదం పొందిన బిల్లులెన్ని? వృథా రోజులెన్ని?


Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20తో ముగిశాయి. ఉభయ సభలైన లోక్ సభ, రాజ్యసభలు నిరవధికంగా వాయిదా పడుతూ వచ్చాయి. నవంబర్ 15 నుంచి ప్రారంభమైన శీతాకాల సమావేశాల్లో అనేక కీలకపరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మొత్తం 20 రోజుల పాటు సాగింది. సెషన్ చివరి రోజైన శుక్రవారం (20 డిసెంబర్ 2024) ఉదయం 11:00 గంటలకు లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. హోంమంత్రి అమిత్ షా ప్రకటనపై విపక్షాల నుంచి దుమారం రేగడంతో సభలో వందేమాతరం ఆలపించిన తర్వాత, లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది.  

ఎప్పటిలాగే చివరి రోజు సైతం రాజ్యసభలో గందరగోళం కొనసాగింది. దీంతో సభా కార్యకలాపాలు మొదట 12 గంటలకు, ఆ తర్వాత 2 గంటలకు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత కూడా ఆందోళనలు కొనసాగడంతో సభ నిరవధికంగా వాయిదా పడింది. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం శీతాకాల సమావేశాల్లో ఎన్ని బిల్లులు ఆమోదం పొందాయి, ఎన్ని ప్రజా సమస్యలపై చర్చ జరిగిందన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అంబేద్కర్‌పై బీజేపీ-కాంగ్రెస్ ముఖాముఖి

పార్లమెంట్ సమావేశాల్లో చివరి రోజున, కాంగ్రెస్ నాయకులు ప్రియాంక గాంధీ నేతృత్వంలో విజయ్ చౌక్ నుంచి పార్లమెంట్ హౌస్ వరకు మార్చ్ నిర్వహించారు. తన ప్రకటనపై హోంమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రదర్శనలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్కడా కనిపించలేదు. ఎఫ్‌ఐఆర్‌లో రాహుల్ గాంధీ పేరు నమోదైనందున ఆయన నిరసనకు నాయకత్వం వహించలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి వెళ్లినట్లు మరోపక్క కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మరోవైపు, నాగాలాండ్‌కు చెందిన ఒక మహిళా ఎంపీతో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలపై బీజేపీ ఎంపీలు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఫైనల్ గా చెప్పాలంటే పార్లమెంట్ సెషన్‌ పొడవునా నిరసనల ప్రదర్శనలు మాత్రమే చూసింది. అయితే ఈ సెషన్‌లో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతులు, దేశ భద్రత వంటి ప్రజలకు సంబంధించిన సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉంది. కానీ ఈసారి పార్లమెంటులో అదానీ, జార్జ్ సోరస్, నెహ్రూ, అంబేద్కర్ పేర్లు శీతాకాల సమావేశమంతా ఉభయ సభల్లో మారుమోగుతూనే ఉన్నాయి. దాదాపు 14రోజుల పాటు అదానీ వ్యవహరంపైనే రచ్చ జరిగింది. దీంతో ఉభయసభల విలువైన సమయం వాయిదాలకే సరిపోయింది. 

శీతాకాల సమావేశాల్లో రూ.84 కోట్ల నష్టం

పార్లమెంటు సమావేశాలకు సంబంధించి ఎప్పటిలాగే చాలా అంశాలు వెలుగులోకి వచ్చాయి. కానీ కొందరు మాత్రమే ఈ విషయాలను సీరియస్‌గా తీసుకుంటారు. కానీ ఈ వార్తలపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇది మన పన్ను ఆదాయాలకు సంబంధించింది. ఇది కార్యకలాపాలను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. పార్లమెంట్ సమావేశాలు పూర్తయ్యాయి. 20 రోజులుగా జరిగిన ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సక్రమంగా సాగకపోవడంతో  రూ.84 కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా. ఇదంతా మన పన్నుల నుంచి వసూలు చేసిన డబ్బే.

పార్లమెంటు కార్యకలాపాలకు నిమిషానికి దాదాపు రూ.2.50 లక్షలు ఖర్చు చేస్తున్నారు. లోక్‌సభ, రాజ్యసభలో పని గంటలను లెక్కిస్తే, లోక్‌సభలో 61 గంటల 55 నిమిషాల పని, రాజ్యసభలో 43 గంటల 39 నిమిషాల పని జరిగింది. లోక్‌సభలో 20, రాజ్యసభలో 19 సమావేశాలు జరిగాయి. ఇది నష్టాల గణాంకాల గురించి, అయితే ఈసారి సెషన్‌లో మరో రికార్డు సృష్టించింది. 1999-2004 మధ్య, 13వ లోక్‌సభలో రెండు సమావేశాలలో 38 బిల్లులు ప్రవేశపెట్టారు. వాటిలో 21 బిల్లులు 2004 నుంచి 2009 వరకు ఆమోదించారు. 14వ లోక్‌సభలో 30 బిల్లులు ప్రవేశపెట్టగా వాటిలో 10 ఆమోదం పొందాయి.

ఈసారి ఒక్క బిల్లు మాత్రమే ఆమోదం 

2009-2014 మధ్య 15వ లోక్‌సభలో 32 బిల్లులు ప్రవేశపెట్టగా.. ఇందులో 17 బిల్లులు ఆమోదం పొందాయి. 2014 నుంచి 2019 వరకు 16వ లోక్‌సభలో 30 బిల్లులు ప్రవేశపెట్టగా, 17 ఆమోదం పొందాయి. 17వ లోక్‌సభలో 55 బిల్లులు ప్రవేశపెట్టగా 42 ఆమోదం పొందాయి. ప్రస్తుత 18వ లోక్‌సభలో రెండు సమావేశాల్లో 15 బిల్లులు ప్రవేశపెట్టగా ఒక్క బిల్లు మాత్రమే ఆమోదం పొందింది. గత ఆరు లోక్‌సభల్లో ఇదే అత్యల్ప సంఖ్య. ఇకపోతే ఎంపీలతో పాటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కూడా రాజ్యసభ లేదా లోక్‌సభ  ఉభయ సభలను నిర్వహించే బాధ్యతను కలిగి ఉంటారు, ఎందుకంటే వారు పార్లమెంటు ఉభయ సభలలో కార్యకలాపాలను నిర్వహిస్తారు.

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments