Homeప్రజా సమస్యలుపంజాబ్ నేషనల్ బ్యాంకులో 1025 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, ఎంపిక ఇలా

పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1025 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, ఎంపిక ఇలా


PNB SO Recruitment: న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్(Punjab National Bank), మానవ వనరుల విభాగం దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1,025 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఖాళీలను అనుసరించి బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎంసీఏ, ఎంబీఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీజీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 7 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 25 లోగా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

 వివరాలు..

* స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 1,025.

పోస్టుల కేటాయింపు: జనరల్-413, ఈడబ్ల్యూఎస్-101, ఓబీసీ-276, ఎస్సీ-155, ఎస్టీ-80.

విభాగాలవారీగా ఖాళీలు..

➥ ఆఫీసర్-క్రెడిట్ (జేఎంజీ స్కేల్-I): 1000 పోస్టులు

➥ మేనేజర్-ఫారెక్స్ (ఎంఎంజీ స్కేల్-II): 15 పోస్టులు

➥ మేనేజర్-సైబర్ సెక్యూరిటీ (ఎంఎంజీ స్కేల్-II): 05 పోస్టులు

➥ సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ (ఎంఎంజీ స్కేల్-III): 05 పోస్టులు

ALSO READ: ఐసీఐసీఐ బ్యాంకులో పీవో పోస్టులు – కోర్సు, స్టైపెండ్ వివరాలు ఇవే

విద్యార్హత: ఖాళీలను అనుసరించి బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎంసీఏ, ఎంబీఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీజీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.01.2024 నాటికి ఆఫీసర్ పోస్టులకు 21-28 సంవత్సరాలు; మేనేజర్‌ పోస్టులకు 25-35 సంవత్సరాలు; సీనియర్ మేనేజర్ పోస్టులకు 27-38 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.1180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.59 చెల్లిస్తే సరిపోతుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో రెండు (పార్ట్-1, పార్ట్-2) విభాగాలుంటాయి. ఇందులో పార్ట్‌-1లో రీజనింగ్‌ 25 ప్రశ్నలు- 25 మార్కులు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 25 ప్రశ్నలు- 25 మార్కులు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు- 50 మార్కులు ఉంటాయి. ఇక పార్ట్‌-2లో ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ 50 ప్రశ్నలు- 100 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు.

జీత భత్యాలు: ఆఫీసర్‌ పోస్టులకు రూ.36,000 – రూ.63,840; మేనేజర్‌ పోస్టులకు రూ.48,170 – రూ.69,810; సీనియర్ మేనేజర్‌ పోస్టులకు రూ.63,840-రూ.78,230.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, వైజాగ్.

ముఖ్యమైన తేదీలు…

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 07.02.2024.

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 25.02.2024.

➥ ఆన్‌లైన్ పరీక్ష తేదీ: మార్చి/ ఏప్రిల్ 2024

Notification

Website

ALSO READ:

యూనియన్ బ్యాంకులో 606 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు – దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇవే
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (Specialist Officers) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 606 ఖాళీలను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు, అనుభవం నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 3 నుంచి 23 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్‌లైన్ రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments