Modi Pongal Celebrations: ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. రాజ్యసభ ఎంపీ ఎల్ మురుగన్ ఇంట్లో జరిగిన ఈ వేడుకలకు తమిళ సంప్రదాయ దుస్తులతో వచ్చారు. తెల్ల లుంగీ, నల్లకోటుతో సందడి చేశారు.
#WATCH | Delhi: Prime Minister @narendramodi attended #Pongal celebrations at the residence of Union Minister @Murugan_MoS
A young singer performed at the event and later touched PM Modi’s feet. Prime Minister gifted her his shawl as a special gesture.@PMOIndia @MIB_India… pic.twitter.com/6mDz6EhJBm
— All India Radio News (@airnewsalerts) January 14, 2024
వేడుకల్లో పాల్గొన్న తరవాత ప్రజల్ని ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా Ek Bharat Shreshtha Bharat నినాదాన్ని ప్రస్తావించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ సూత్రానికి ఈ సంక్రాంతి పండగే నిదర్శనమని వెల్లడించారు. ఈ ఐక్యతే భారత్‌ని ముందుకు నడిపిస్తుందని అన్నారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇదే సమయంలో Kashi Tamil Sangamam గురించి ప్రస్తావించారు. దేశ ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. ఆ తరవాత జరిగిన సాంస్కృతి కార్యక్రమంలోనూ పాల్గొన్నారు.
“ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్‌కి నిలువెత్తు నిదర్శనం ఈ సంక్రాంతి పండుగ. ఈ ఐక్యతే మనల్ని ముందుకు నడిపిస్తుంది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునేలా చేస్తుంది. నిన్న దేశమంతా లోహ్రి పండుగను జరుపుకుంది. ఇప్పుడు మకర సంక్రాంతి వంతు వచ్చింది. ఎప్పుడు ఎవరు ఎలా పండుగ జరుపుకున్నా సరే అందరికీ నా శుభాకాంక్షలు”
– ప్రధాని నరేంద్ర మోదీ
#WATCH | Delhi: PM Narendra Modi says, “The country celebrated the festival of Lohri yesterday. Some people are celebrating Makar Sankranti today and some people will celebrate tomorrow, Magh Bihu is also coming, I extend my greetings to the countrymen for these festivals.” pic.twitter.com/ahTSPUejBY
— ANI (@ANI) January 14, 2024
ఈ వేడుకల్లో ప్రధాని మోదీతో పాటు పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.
#WATCH | Prime Minister Narendra Modi attends #Pongal celebrations at the residence of MoS L Murugan in Delhi. pic.twitter.com/4obBKJKYK4
— ANI (@ANI) January 14, 2024