Deepfake Videos Threat:
డీప్‌ఫేక్ సవాల్..
Deepfakes Tool: టెక్నాలజీ ఏదైనా హద్దుల్లో ఉన్నంత వరకూ ఓకే. అది దాటితేనే సమస్య. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI Technology) విషయంలో ఇప్పుడిదే జరుగుతోంది. చాట్‌జీపీటీ (ChatGPT)ని చూసి అద్భుతం అనుకున్నాం. ఇదే సమయంలో AI టూల్ డీప్‌ఫేక్ (Deepfakes) టెక్నాలజీ మాత్రం పెద్ద సవాలే విసురుతోంది. సినీనటి రష్మిక మందన్న (Rashmika Deepfake Video) వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. డీప్‌ఫేక్‌ని అంతా సీరియస్‌గా తీసుకుంది కూడా ఈ వీడియో తరవాతే. బాలీవుడ్ ఇండస్ట్రీనే కాదు మొత్తం దేశాన్నే షేక్ చేసేసింది ఈ ఒక్క వీడియో. సింపుల్‌గా చెప్పాలంటే డీప్‌ఫేక్ టెక్నాలజీకి ఉన్న డార్క్‌సైడ్ అందరికీ పరిచయమైంది. ఎవరో వ్యక్తి ఫేస్‌కి మరెవరిదో ముఖాన్ని అతికించి అచ్చం నిజంలాగే అనిపించే మాయ చేయడం డీప్‌ఫేక్‌కి (Deepfake Challenges) ఉన్న స్పెషాల్టీ. నిజానికి ఇదే అసలు ఛాలెంజ్ కూడా. ఒక్క వీడియోలే కాదు. ఆడియో,ఫొటోలనూ మార్ఫింగ్ చేసేస్తున్నారు. రష్మిక తరవాత కాజోల్, కత్రినా కైఫ్ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ గార్బా డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఓ వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు కొందరు. అబద్ధాన్ని నిజం అని నమ్మించగలిగే మాయాజాలం ఇది. నిజానికి డీప్‌ఫేక్ టూల్ 2017లోనే పరిచయమైంది. అప్పట్లో ఓ వ్యక్తి కొన్ని అభ్యంతరకరమైన వీడియోలకు పాపులర్ యాక్టర్స్ ఫేస్‌లు అతికించి వీడియోలు క్రియేట్ చేశాడు. అప్పట్లో అది సంచలనమైంది. అప్పటితో పోల్చి చూస్తే…ప్రస్తుతం ఈ డీప్‌ఫేక్ వాడకం 230% మేర పెరిగిందని అంచనా. ఈ టూల్‌తో ఇష్టమొచ్చినట్టు ఆటలాడుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. అశ్లీల వీడియోలకు ఎవరివో ఫేస్‌లు అతికించి బెదిరించడం లాంటివి చేస్తున్నారు.
ఎలా పని చేస్తుంది..?
డీప్‌ఫేక్ అని మామూలు మాటల్లో చెప్పాలంటే ముఖాలు మార్చేయడం. అంటే ఫేస్ స్వాపింగ్ (What is Deepfake). generative adversarial network అనే మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీతో ఇది పని చేస్తుంది. సోర్స్ మెటీరియల్ నుంచి ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌ని డిటెక్ట్ చేసి…వాటిని డూప్లికేట్ చేసేస్తుంది. అది వీడియో అయినా, ఇమేజ్ అయినా ఇట్టే మార్చేస్తుంది. అది ఎంత ఒరిజినల్‌గా ఉంటుందంటే…మన వీడియోని డూప్లికేట్ చేసినా మనమే గుర్తుపట్టలేం. ఇందుకోసం క్రియేటర్స్ సోర్స్ ఇమేజెస్ (Deepfake Source Images) కోసం భారీ డేటాబేస్‌ని వాడుకుంటారు. అందరి అటెన్షన్ రావాలంటే సెలెబ్రిటీలనే టార్గెట్ చేసుకుంటారు. వీటిని గుర్తించడం కొంచెం కష్టమే అంటున్నారు టెక్ నిపుణులు. రెండు సాఫ్ట్‌వేర్‌లు కలిస్తేనే ఓ డీప్‌ఫేక్ వీడియో క్రియేట్ చేయొచ్చు. ముఖ్యంగా పోర్నోగ్రఫీ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్లే ఈ టూల్‌ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో పాటు ఆడియో, ఫొటోలనూ క్రియేట్ చేస్తుండడం వల్ల ఆందోళనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఫేక్ ఆడియో క్లిప్‌లు సృష్టించడం అసలుకే ఎసరు పెడుతోంది.
సవాలుని ఎలా ఎదుర్కోవాలి..?
ఇప్పటికే ఈ టూల్‌పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఇలాంటి వీడియోలు ఏమైనా ఉంటే వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. నోటీసులు కూడా ఇచ్చింది. IT Act 2000లోని సెక్షన్ 66D కింద ఇది తీవ్రమైన నేరం అని తేల్చి చెబుతోంది. ఇక 2021 ఐటీ యాక్ట్ కింద ఇలాంటి కంటెంట్‌ని తొలగించడం సోషల్ మీడియా విధి అని స్పష్టం చేస్తోంది. కొన్ని దేశాలు ఈ సమస్యను ముందే గుర్తించి ఆంక్షలు విధించాయి. కంటెంట్ క్రియేట్ చేసే వాళ్లెవరైనా సరే సోర్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారో నిఘా పెడుతోంది యురోపియిన్ యూనియన్. ఈ మేరకు గైడ్‌లైన్స్ కూడా జారీ చేసింది. చైనా కూడా సర్వీస్ ప్రొవైడర్స్‌కి గైడ్‌లైన్స్ ఇచ్చింది. డీప్‌ఫేక్ వీడియోల సోర్స్‌ని సులువుగా గుర్తించేలా కఠినంగా వ్యవహరిస్తోంది. అమెరికా అయితే ఏకంగా Deepfake Task Force Act రూపొందించింది. డీప్‌ఫేక్ టెక్నాలజీని కౌంటర్ చేయడానికి దీన్నే అస్త్రంగా మలుచుకుంది.
Also Read: Sam Altman: మైక్రోసాఫ్ట్‌లోకి OpenAI మాజీ సీఈవో, అధికారికంగా ట్వీట్ చేసిన సత్య నాదెళ్ల