చెన్నైలోని విరుగంపాక్కంలోని రాజమన్నార్ ప్రాంతానికి చెందిన దేవరాజ్ ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. ఆదివారం పొరపాటున కార్పోరేషన్ చెత్త సేకరణ బండిలో చెత్తతో పాటు రూ.5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ వేశాడు. ఈ విషయం తెలియక తర్వాత ఇంట్లో ఉన్న నెక్లెస్ మాయమైందని, పొరపాటున డస్ట్‌బిన్‌లో వేసి ఉండవచ్చని గ్రహించిన దేవరాజ్, వెంటనే సహాయం కోసం అధికారులను సంప్రదించాడు.