Homeప్రజా సమస్యలుకశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు

కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు – కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు


Congress party has printed flexi maps without Kashmir in India map: కాంగ్రెస్ పార్టీ మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఆ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశాలు కర్ణటాకలోని బెళగావిలో జరుగుతున్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో ఇండియా మ్యాప్ ను ముుద్రించారు. కశ్మీర్ తో పాటు లెహ్ లేకుండా ఆ ఫ్లెక్సీ ఉంది.                                      

ఈ అంశంపై బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కావాలనే ఇలా చేస్తోందని దేశానికి వెన్నుపోటు పొడుస్తోందని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. బీఎల్ సంతోష్ చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేసి ఘాటు విమర్శలు చేశారు.                    



 ఈ ఫ్లెక్సీల వివాదం బీజేపీ జాతీయ నేతలు కూడా తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. 



 



 

మరో వైపు ఈ వివాదంపై కాంగ్రెస్ ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ఆ ఫ్లెక్సీలను కూడా తీసేయలేదుని తెలుస్తోంది.  ఇండియా మ్యాప్ ను కేంద్రం అధికారికంగా ప్రకటిస్తుంది. అలా కాకుండా వేరే వేరే మ్యాప్ లను ప్రచురించడం వల్ల అంతర్జాతీయంగా చర్చ జరుగుతుందని కశ్మీర్,లెహ్ ప్రాంతాలు ఇండియాలో భాగం కాదన్నది కాంగ్రెస్ పార్టీ విధానమన్నట్లుగా ఉంటాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై కాంగ్రెస్ విధానమేంటో స్పష్టం చేయలేదు.                                 

 

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments