Attorney Behind US Department Move Against Adani Group To Resign: అమెరికాతో పాటు భారత్ లోనూ సంచలనం సృష్టించిన అదానీ గ్రూపుపై అమెరికాలో కేసు వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ ఆరోపణల విషయంలో కీలకంగా ఉన్న అటార్నీ బ్రీన్ పీస్ తన పదవికి రాజీనామాను ప్రకటించారు. జనవరి పదో తేదీన ఆయన లాస్ట్ వర్కింగ్ డే. 50 ఏళ్ల పీస్‌ను 2021లో అధ్యక్షుడు జో బైడెన్ నియమించారు. జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన కంటే పది రోజుల ముందే అటార్నీ పదవి నుంచి వైదొలగనున్నారు. ప్రస్తుతం అమెరికా అసిస్టెంట్ అటార్నీగా ఉన్న కరోలిన్ పోకోర్నీ … బ్రీన్ పీస్ స్థానంలో తాత్కాలిక బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇండియాలోని విద్యుత్ ప్రాజెక్టుల కాంట్రాక్టుల్లో అధిక ధరలు నిర్ణయించడానికి అదానీ లంచాలు ఇచ్చారని .. ఆ విషయాన్ని దాటి పెట్టి యుఎస్ పెట్టుబడిదారులను మోసం చేశారనే ఆరోపణలపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ , సంస్థకు చెందిన ఇతర అధికారులపై నవంబర్లో కేసులు నమోదు చేయడంలో బ్రీన్ పీస్ కీలకంగా వ్యవహరించారు. అయితే ఈ అభియోగాలను అదానీ గ్రూపు తిరస్కరించింది. లంచాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
అమెరికా అటార్నీ చేసిన తప్పుడు చర్య వల్ల అంతర్జాతీయ ప్రాజెక్టుల రద్దు, ఆర్థిక మార్కెట్ పై ప్రబావం పడిందని అదానీ గ్రూపు అమెరికాపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అమెరికా ప్రభుత్వ నివేదిక అదానీ గ్రీన్ ఎనర్జీ ఒప్పందంతో ముడిపడి ఉందని అ ఇది అనుబంధ వ్యాపారంలో సుమారు 10 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపింది. అదానీ గ్రూప్ కు చెందిన 11 ప్రభుత్వ కంపెనీల్లో ఏ ఒక్కదానిలోనూ ఎలాంటి అక్రమాలు జరగలేదని గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జుగేషిందర్ సింగ్ కేసులు నమోదయినప్పుడే ప్రకటించారు.
Also Read: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త – ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
అదానిపై అమెరికాలో నమోదైన కేసు ఇండియాలో రాజకీయగానూ సంచలనంగా మారింది. ముఖ్యంగా ఏపీలోనూ ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. అప్పటి ఏపీ సీఎంకు రూ. 1750 కోట్లు లంచాన్ని అదానీ ఇచ్చారని యూఎస్ అటార్నీ ఆరోపణుల చేశారు. దీంతో ఏపీలో జగన్ పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపించాయి. అయితే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం అది ప్రైవేటు కంపెనీల వ్యవహారమని స్పష్టం చేసింది. జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు బిడెన్ స్పందించారు. తమ దేశ చట్టాల ప్రకారమే కేసు నమోదయిందని ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటామని ప్రకటించారు. ఇప్పుడు ప్రభుత్వం అమెరికాలో మారనున్న సమయంలో .. కీలక స్థానాల్లో ఉన్న వారు రాజీనామాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అటార్నీ కూడా మారిపోయారు.
మరిన్ని చూడండి