షర్మిల వ్యాఖ్యలపై వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాదు ఎవరు వచ్చిన తమ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయలేరన్నారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ అభివృద్ధి జరగలేదని చెప్పడానికి వాళ్ళేవారని ప్రశ్నించారు. రమ్మనండి ఛాలెంజ్ చేస్తున్నాం.. తమతో వస్తే అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపిస్తామని తెలిపారు. తెలంగాణలో రాజకీయాలు చేసి ఇప్పుడు ఆంధ్రాకు వచ్చి ఆమె మాట్లాడితే ఎలా అని దుయ్యబట్టారు.
Ram Mandir: అయోధ్య రామ మందిరానికి ఏ రాష్ట్రం ఏం ఇచ్చింది..?
రాష్ట్రంకు వచ్చిన మొదటి రోజే అభివృద్ధి జరగలేదని షర్మిల ఎలా అనగలుగుతారని సుబ్బారెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్ ఆశయాల కోసం పోరాడుతున్నది వైసీపీ అయితే, రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టింది సోనియా కాంగ్రెస్ అని ఆరోపించారు. ఢిల్లీ కాంగ్రెస్ లో చేరి మమ్మల్ని టార్గెట్ చేయడం ఎంత వరకు కరెక్టో షర్మిల సమీక్షించుకోవాలని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వంతో కాంప్రమైజ్ అయ్యామే తప్ప.. తాము ఎక్కడ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టలేదని పేర్కొన్నారు.
YS Sharmila: దేవుడు అద్భుతం చేయాలి.. కాంగ్రెస్ అధికారంలోకి రావాలి..
ఈనెల 27న ఉత్తరాంధ్ర నుంచి ముఖ్యమంత్రి ఎన్నికల శంఖారావం పూరిస్తారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 34 నియోజకవర్గాల నుంచి 2లక్షల మంది బహిరంగ సభకు తరలివస్తారని చెప్పారు. సభ విజయవంతం కోసం కమిటీల ఏర్పాటు, స్థల పరిశీలన పూర్తయిందని పేర్కొన్నారు. షర్మిల ఎన్ని విమర్శలు చేసినా ఆంధ్ర ప్రదేశ్ జగన్ వెంటేనని అన్నారు. రాష్ట్రంలో కనీసం పర్యటించకుండానే బిల్డింగ్ లు, రోడ్లు లేవని చెప్తోందా? అని ప్రశ్నించారు. అభివృద్ది అంటే రోడ్లు, బిల్డింగ్ లేనా? అని దుయ్యబట్టారు.