Homeతెలుగు రాష్ట్రాలుYS Jagan Kadapa Tour: రేపటి నుంచి కడప జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన..

YS Jagan Kadapa Tour: రేపటి నుంచి కడప జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన..


  • కడప జిల్లాలో నాలుగు రోజుల పర్యటనకు సిద్ధమైన వైఎస్ జగన్..
  • రేపటి నుంచి 4 రోజుల పర్యటన..
  • రేపు బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేరుకోనున్న మాజీ సీఎం..
YS Jagan Kadapa Tour: రేపటి నుంచి కడప జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన..

YS Jagan Kadapa Tour: తన సొంత జిల్లాలో మరోసారి పర్యటించబోతున్నారు ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. కడప జిల్లాలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా రేపు ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేరుకోనున్న ఆయన.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఘాట్‌ వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ఇడుపులపాయలోని చర్చిలో జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత కడప మున్సిపల్ కార్పొరేటర్లతో సమావేశమవుతారు. వారితో పాటు కడప నియోజకవర్గ వైసీపీ నాయకులతో కూడా ఆయన సమావేశం కానున్నారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు ఇడుపులపాయ నుంచి పులివెందుల బయలుదేరి వెళ్లి రాత్రికి అక్కడ ఆయన నివాసంలో బస చేస్తారు…

Read Also: U23 State Trophy: మెరిసిన యువ సంచలనం.. 21 పరుగులిచ్చి 8 వికెట్లు తీసిన ఢిల్లీ ప్లేయర్

ఇక, 25వ తేదీన ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్‌ సందర్భంగా పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్‌ వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు వైఎస్‌ జగన్… ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు తాతిరెడ్డిపల్లిలో రామాలయాన్ని ప్రారంభించిన అనంతం పులివెందుల చేరుకుని రాత్రికి బస చేస్తారు.. మరోవైపు, 26వ తేదీన పులివెందుల క్యాంప్‌ ఆఫీస్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజాదర్భార్‌ నిర్వహిస్తారు.. ఇక, 27వ తేదీన ఉదయం 9 గంటలకు పులివెందుల విజయా గార్డెన్స్‌లో జరగనున్న వివాహానికి హాజరవుతారు. అనంతరం పులివెందుల నుంచి బయల్దేరి తిరిగి బెంగళూరు వెళ్లనున్నారు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి..





Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments