నేడు వైసీపీ ఎన్నికల శంఖారావం.. భీమిలి సంగివలస దగ్గర”సిద్ధం” పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోన్న వైసీపీ.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్..
నేడు మధిర నియోజకవర్గంలోని మధిర చింతకాని మండలాలలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న భట్టి
నేడు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఖమ్మం నియోజకవర్గం లో పర్యటన..
నేడు గద్వాల జిల్లాలో మంత్రులు సీతక్క, దామోదర రాజనర్సింహల పర్యటన..
నేడు అనంతపురం జిల్లా ఉరవకొండలో టీడీపీ రా కదలి రా బహిరంగ సభ.. సాయంత్రం 4:00 బహిరంగ సభకు హాజరు కానున్న చంద్రబాబు.. రాత్రికి ఉరవకొండలోనే బస చేయనున్న చంద్రబాబు.. 28న ఉదయం ఉరవకొండ నుంచి నెల్లూరు బయలు దేరి వెళ్లనున్న చంద్రబాబు.
నేడు ఒంగోలులో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటన.. త్రోవగుంట సమీపంలోని విష్ణుప్రియ కన్వెన్షన్ లో పార్టీ కార్యకర్తల సమావేశం.. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొననున్న షర్మిల..
నేడు రాజమండ్రి సిటీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం.. రాజమండ్రి వి.ఎల్.పురం, మార్గాని ఎస్టేట్స్ లో జరుగనున్న సమావేశం.. ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేస్తున్న తొలి సమావేశం.
నేడు నంద్యాల జిల్లా బేతంచెర్ల ప్రభుత్వ ఐటీఐ ను ,ఎంఎస్ఎమ్ ఈ భవనాన్ని ప్రారంభించనున్న మంత్రి బుగ్గన..
నేడు డోన్ లో సబ్ కోర్టు భవనానికి భూమి పూజ.. హాజరుకానున్న ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులు
నేడు ప్రకాశం జిల్లా చీమకుర్తిలో నూతనంగా నిర్మించిన పురపాలక కార్యాలయ భవనాన్ని ప్రారంభించనున్న మంత్రి మేరుగ నాగార్జున.. ముఖ్య అతిథులుగా పాల్గొననున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి సమన్వయకర్త బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి..
నేడు నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరులో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభిస్తారు.. అనంతరం నాలుగో విడత ఆసరా కార్యక్రమంలో పాల్గొంటారు.
నేడు నందిగామలో వైసీపీ ఆత్మీయ సమావేశం.. హాజరుకానున్న ఎంపీ కేశినేని నానీ, ఎమ్మెల్యే జగన్మోహన్, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్.
నేడు నెల్లూరు రూరల్ పరిధిలోని కొండయ్యపాలెం గ్రామంలో జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న ఎంపీ అద్దాల ప్రభాకర్ రెడ్డి.
నేడు నేడు బెజవాడలో ముదు దారులు పుస్తక ఆవిష్కరణ.. హాజరుకానున్న జయప్రకాష్ నారాయణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.
నేడు హైదరాబాద్ లోని మూడో రోజు కొనసాగుతున్న భారత్- ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్..