Homeతెలుగు రాష్ట్రాలుVirat Kohli: విరాట్ కోహ్లీపై చేయి వేసిన అభిమాని.. మెల్‌బోర్న్‌ మైదానంలో కలకలం!

Virat Kohli: విరాట్ కోహ్లీపై చేయి వేసిన అభిమాని.. మెల్‌బోర్న్‌ మైదానంలో కలకలం!


  • మెల్‌బోర్న్‌ మైదానంలో కలకలం
  • కోహ్లీపై చేయి వేసిన అభిమాని
  • నాలుగో టెస్టులో భారీ స్కోర్‌ దిశగా ఆస్ట్రేలియా
Virat Kohli: విరాట్ కోహ్లీపై చేయి వేసిన అభిమాని.. మెల్‌బోర్న్‌ మైదానంలో కలకలం!

బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. స్టేడియంలోని ఓ అభిమాని బారికేడ్లు దాడి మరీ మైదానంలోకి దూసుకొచ్చి.. టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్ కోహ్లీని ఆలింగనం చేసుకొనేందుకు ప్రయత్నించాడు. హగ్‌ చేసుకొనేందుకు కుదరకపోవడంతో.. కోహ్లీపై చేయి వేసి పోజులు ఇచ్చాడు. ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అభిమాని మైదానంలోకి దూసుకొచ్చి.. ముందుగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వైపు వెళ్ళాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకోగలిగింది. అక్కడే ఉన్న విరాట్ కోహ్లీ దగ్గరకు వెళ్లి ఆలింగనం చేసుకొనేందుకు ప్రయత్నించాడు. విరాట్ ప్రతిఘటించడంతో ఆది బుజంపై చేయి వేసి.. నవ్వులు పోయించాడు. విరాట్ కూడా అతడితో మాట్లాడాడు. ఇంతలో సిబ్బంది వచ్చి అతడిని బయటకు తీసుకెళ్లారు. ఈ షాకింగ్ ఘటనతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. సదరు అభిమాని మైదానం నుంచి వెళ్లగానే.. మ్యాచ్‌ను అంపైర్లు కొనసాగించారు. నిబంధనలకు విరుద్ధంగా మైదానంలోకి వచ్చిన అతడిపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Also Read: AUS vs IND: స్టీవ్ స్మిత్ సెంచరీ.. లంచ్ బ్రేక్‌కు ఆస్ట్రేలియా స్కోరు 454/7!

మొదటి రోజు ఆటలో విరాట్ కోహ్లీ, సామ్‌ కాన్‌స్టాస్‌ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెల్బోర్న్ మైదానంలో ప్రేక్షకులు కోహ్లీ పేరును పెద్ద ఎత్తున హోరెత్తించారు. మెల్‌బోర్న్‌ స్టేడియంలోని దాదాపు 85 వేల మంది ప్రేక్షకులను ప్రోత్సహిస్తున్నట్లుగా కోహ్లీ సైగలు చేశాడు. ఇందుకు సంబందించిన వీడియోస్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఈ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 119 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 465 రన్స్ చేసింది.





Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments