Homeతెలుగు రాష్ట్రాలుVinesh Phogat: అది పీడకల అయితే బాగుండు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్!

Vinesh Phogat: అది పీడకల అయితే బాగుండు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్!


  • వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు
  • ఆనంద్‌ మహీంద్రా దిగ్భ్రాంతి
  • నిజం కాకపోతే బాగుండు
Vinesh Phogat: అది పీడకల అయితే బాగుండు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్!

Anand Mahindra on Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్‌ 2024లో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించి రెజ్లింగ్‌ ఫైనల్‌కు చేరిన వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. ఫైనల్‌ పోరుకు ముందు ఆమె నిర్ణీత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో అనర్హత వేటు పడింది. దాంతో వినేశ్‌ ఆశలు గల్లంతయ్యాయి. ఫైనల్లో గోల్డ్ మెడల్ కొడుతుందని ఆశించిన ప్రతి భారతీయుడిని ఈ అనర్హత వేటు షాక్‌కు గురి చేసింది. ఈ క్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా కూడా షాక్ అయ్యారు.

Also Read: Vinesh Phogat Hospitalised: వినేశ్‌ ఫొగాట్‌కు తీవ్ర అస్వస్థత.. పారిస్‌లోని ఆస్పత్రికి తరలింపు!

వినేశ్‌ ఫొగాట్‌ అనర్హత వేటుపై మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్‌ మహీంద్రా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘నోనోనో.. ఇది పీడకల అయితే బాగుండు. ఇది నిజం కాకపోతే బాగుండు’ అని పేర్కొన్నారు. ఎక్స్‌ప్రెస్ స్పోర్ట్స్ ట్వీటును పోస్ట్ చేశారు. పతక రేసులో ఉన్న వినేశ్‌పై అనర్హత వేటును ప్రతి భారతీయుడు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు వినేశ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.





Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments