Homeతెలుగు రాష్ట్రాలుVijayawada To Mumbai Flight : ఏపీ వాసులకు శుభవార్త, విజయవాడ-ముంబయి మధ్య ఎయిర్ ఇండియా...

Vijayawada To Mumbai Flight : ఏపీ వాసులకు శుభవార్త, విజయవాడ-ముంబయి మధ్య ఎయిర్ ఇండియా డైలీ సర్వీస్


ఎంపీ బాలశౌరి చొరవ

గన్నవరం విమానాశ్రయం నుంచి ముంబయికి జూన్ 15, 2024 నుంచి కొత్త విమాన సర్వీసును ప్రారంభిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి చొరవతో ఈ విమాన సర్వీసును ప్రారంభం అయ్యిందని, ఎంపీ కార్యాలయం ప్రెస్ నోట్‌ విడుదల చేసింది. దీంతో విజయవాడ, గుంటూరు, ఒంగోలు, ఏలూరు పరిసర ప్రాంతాల్లోని బిజినెస్ మెన్, వ్యాపారస్తులు తమ అవసరాల నిమ్మిత్తం విజయవాడ నుంచి ముంబకి, ముంబయి నుంచి విజయవాడ ప్రయాణించేందుకు సౌకర్యంగా ఉంటుంది. ఈ ఫ్లైట్ శనివారం సాయంత్రం 5.45నిమిషాలకు ముంబయి నుంచి విజయవాడకు చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 7.10 గంటలకు విజయవాడ నుంచి ముంబయికి అదే విమానం బయలుదేరుతుంది. విజయవాడ నుంచి ముంబయికి సర్వీస్ ఏర్పాటు చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments