రాక్షస జాతికి చెందిన వ్యక్తులు
రాక్షస జాతికి చెందిన వ్యక్తుల తరహాలో చాలా అసహ్యమైన భాషలో చంద్రబాబు, లోకేశ్, పవన్ కుటుంబ సభ్యుల గురించి వర్రా రవీందర్ రెడ్డి పోస్టులు పెట్టారని పోలీసులు తెలిపారు. వర్రా రవీందర్ రెడ్డిని సోషల్ మీడియా అకౌంట్ నుంచి మూడు విధాలుగా పోస్టులు పెడుతున్నారు. వర్రా సొంతంగా కొన్ని పోస్టులు పెడితే..తాడేపల్లి కార్యాలయం నుంచి కొన్ని పోస్టులు, ఎంపీ అవినాష్ రెడ్డి పీవీ పంపిన కొన్ని పోస్టులు పెట్టారన్నారు. షర్మిల, వైఎస్ సునీతారెడ్డిపై పెట్టిన పోస్టులు అవినాష్ రెడ్డి పీఏ పంపినట్లు గుర్తించామన్నారు. అవినాష్ రెడ్డి పీఏ వాట్సాప్ నెంబర్ నుంచి వర్రా రవీందర్ రెడ్డికి ఈ పోస్టులు వచ్చాయన్నారు. అవినాష్ రెడ్డి చెబుతుంటే ఆయన పీఏ ఈ వివరాలు రాసుకుని…వర్రాకు పంపేవారని తెలిసిందన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. అలాగే వైఎస్ సునీతారెడ్డి హైదరాబాద్ లో ఫిర్యాదు చేశారని, ఆమె ఏపీలో ఫిర్యాదు చేస్తే ఈ విషయంపై మరింత దర్యాప్తు చేస్తామన్నారు.