Homeతెలుగు రాష్ట్రాలుUrvashi Rautela: ఊర్వశీ రౌటేలా వేసుకున్న హ్యాండ్ బ్యాగ్ ధర అన్ని లక్షలా?

Urvashi Rautela: ఊర్వశీ రౌటేలా వేసుకున్న హ్యాండ్ బ్యాగ్ ధర అన్ని లక్షలా?


బాలివుడ్ హాట్ బ్యూటీలలో ఒకరు ఊర్వశి రౌటేలా.. సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరుస్తూ యువతలో మంచి క్రేజ్ ను అందుకుంది.. వరుస తెలుగు హిట్ సినిమాల్లో సాంగ్స్ చేసింది.. అయితే ఈ అమ్మడు ఫ్యాషన్ ఐకాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఏ ఈవెంట్ కు వచ్చిన కూడా ప్రత్యేకంగా వస్తుందన్న విషయం తెలిసిందే.తన స్టైల్ స్టేట్‌మెంట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచే అవకాశాన్ని ఎప్పుడూ వదలదు.. తాజాగా ఓ ఈవెంట్ కోసం రెడీ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.. అలాగే ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..

ఊర్వశి 2013లో సింగ్ సాబ్ ది గ్రేట్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తరువాత ఆమె హేట్ స్టోరీ 4, గ్రేట్ గ్రాండ్ మస్తీ, సనమ్ రే, పగల్‌పంతి, మరెన్నో చిత్రాలలో నటించి అలరించింది. ఇటు తెలుగులో పలు ల్లో స్పెషల్ సాంగ్స్ చేసి టాలీవుడ్ అడియన్స్ కు దగ్గరయ్యింది. ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 28న ఊర్వశి రౌతేలా ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేసింది. ఆమె సూపర్-స్టైలిష్ ఇంకా సౌకర్యవంతమైన, సింపుల్ లుక్ లో కనిపిచింది.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

ఒక ఫ్లేర్డ్ జీన్స్‌ను ధరించింది. ఆమె దానిని హాల్టర్ నెక్ క్రాప్ టాప్, డెనిమ్ జాకెట్‌తో స్టైల్ చేసింది. ఇందులో పెర్ల్, టాసెల్ జతచేసింది. ఊర్వశి ఒక జత స్టడ్ చెవిపోగులు, క్లాసీ సన్ గ్లాసెస్, ఓపెన్ ట్రెస్‌లతో తన రూపాన్ని మరింత అందంగా మార్చింది. డ్యూయ్ మేకప్, స్నీకర్స్, స్టైలిష్ హ్యాండ్‌బ్యాగ్ అందరిని ఆకట్టుకున్నాయి..బ్యాగ్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. టోట్ బ్యాగ్ భారీ ధర ట్యాగ్‌ తెలిసి నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ఎందుకంటే ఆ బ్యాగ్ ధర $6,342 USD. అంటే మన కరెన్సీలో రూ.5,27,657.57. అంతకుముందు, మే 21న, కేన్స్ తర్వాత పార్టీ నుండి ఊర్వశి నలుపు-రంగు, ఆఫ్-షోల్డర్ కార్సెట్-స్టైల్ దుస్తులను ధరించింది. ఇందులో వెండి స్ఫటికాలతో అలంకారాలు చేసి ఉన్నాయి… ఇవే కాదు ఇంకా ఎన్నో ఖరీదైన వస్తువులు ఆమె దగ్గర ఉన్నాయి..



Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments