- కలకలం సృష్టించిన ఉజ్జయిని అత్యాచార ఘటన
-
వీడియో వైరల్ కావడంతో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు -
కొంతమంది తమ ఫోన్లలో ఘటన వీడియో రికార్డ్ -
వారిని అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్న పోలీసులు.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో రోడ్డు పక్కన జరిగిన అత్యాచార ఘటన కలకలం సృష్టించింది. అత్యాచారం వీడియో వైరల్ కావడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అయితే.. ఈ ఘటనను చూసి ఆపాల్సింది పోయి.. అక్కడున్న కొంతమంది తమ ఫోన్లలో వీడియో రికార్డ్ చేశారు. వారిని గుర్తించిన పోలీసులు.. అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాగా.. ఉజ్జయినిలోని అగర్ నాకా ప్రాంతంలో ఓ వ్యక్తి మహిళకు బలవంతంగా మద్యం తాగించి అత్యాచారం చేశాడు. ఈ అత్యాచారం వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో.. మధ్యప్రదేశ్‌లో మహిళల భద్రతపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి.
Read Also: Hyderabad Rain: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం
కొత్వాలి ఏరియా సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (CSP) ఓం ప్రకాష్ మిశ్రా మాట్లాడుతూ.. ఈ సంఘటనను వీడియో తీసి వైరల్ చేసిన ముగ్గురు నలుగురు అనుమానితులను తాము గుర్తించామన్నారు. వీరంతా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు గాలిస్తున్నారని తెలిపారు. అయితే.. బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉందని, ఆమె ఇంట్లోనే ఉందని సీఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు లోకేష్.. ఆ మహిళను పెళ్లి చేసుకుంటానని బాధిత మహిళకు చెప్పాడు. ఈ క్రమంలో.. బుధవారం మహిళకు బలవంతంగా మద్యం తాగించాడు, అనంతరం రోడ్డు పక్కనే అత్యాచారం చేశాడు. అటుగా వెళ్తున్న కొందరు ఈ దుశ్చర్యను ఆపడానికి బదులు ఘటనను వీడియో తీశారని మిశ్రా తెలిపారు. అనంతరం లోకేష్ అక్కడి నుంచి పరారయ్యాడని.. మహిళ ఫిర్యాదు మేరకు అతన్ని అరెస్ట్ చేశామని ఓం ప్రకాష్ మిశ్రా చెప్పారు.
Read Also: Ganesh Chaturthi: ఒక్క అడుగుతో ప్రారంభం.. ఖైరాతాబాద్ వినాయకుడికి 70ఏళ్ల చరిత్ర