యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ గా.. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు కామెడీ వెబ్‌సిరీస్ తులసివనం. ఈ సిరీస్ గురువారం నుంచి ఓటీటీలోకి వచ్చేసింది. ఈటీవీ విన్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సిరీస్ సంబంధించి మొదటి ఎపిసోడ్‌ను ఫ్రీగా చూడొచ్చొని ఓటీటీ సంస్థ ప్రకటించింది. ఈ సిరీస్ సంబంధించి మొత్తం మూడు ఎపిసోడ్స్‌ను మాత్రమే రిలీజ్ చేసారు చిత్ర బృందం. సిరీస్ లోని మిగితా ఎపిసోడ్స్ త్వరలోనే రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం.
Also Read: HanuMan : హనుమాన్ కు తొలి అవార్డును అందుకున్న ప్రశాంత్ వర్మ..
ఇక ఈ సిరీస్ లోనటీనటుల విషయానికి వస్తే.. అక్షయ్ లగుసాని, ఐశ్వర్య హోలక్కల్, వెంకటేష్ కాకుమాను, టాక్సీవాలా విష్ణులు కీలక పాత్రలు పోషించారు. ఇక కథ విషయానికి వస్తే.. తులసి అనే ఓ యువకుడి జీవితంలో జరిగిన కొన్ని చిత్రవిచిత్ర సంఘటనలతో దర్శకుడు అనిల్ రెడ్డి ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించాడు. ఐఏఎస్ ఆఫీసర్ గా తులసిని చూడాలని తండ్రి కోరుకుంటాడు. కానీ అతను మాత్రం క్రికెటర్ అవ్వాలని కలలు కంటాడు.
Also Read: Bode Prasad: నా పిల్లల మీద ఒట్టు.. కొడాలి నాని, వల్లభనేని వంశీతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు…!
కాకపోతే తండ్రి బలవంతంతో ఓ సాఫ్ట్‌వేర్ జాబ్ లో తులసి ఎందుకు చేరాడు.. హైదరాబాద్ కు వచ్చిన అతడు తన కలలకు వాస్తవ జీవితానికి మధ్య ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడన్నది ఈ సిరీస్ కథాంశం. ఈ సిరీస్ యువత మనోభావాలకు అతి దగ్గరగా చాలా రియలిస్టిక్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్‌సిరీస్ లో అభినవ్ గోమటం ఓ గెస్ట్ రోల్‌లో కనిపించాడు. స్వాగత్ రెడ్డి, నీలిత పైడిపల్లి, జీవన్ కుమార్, ప్రీతమ్ తరుణ్ భాస్కర్ ప్రజెంటర్ గా వ్యవహరిస్తోన్న ఈ సిరీస్ ను కలిసి నిర్మించారు.