- దేశంలోని వివిధ రాష్ట్రాలలో రైల్వే ట్రాక్ లకు అంతరాయం కలిగించిన ఘటనలు.
- తాజాగా యూపీలోని రాంపూర్ జిల్లాలో రైల్వే ట్రాక్‌పై ఇనుప స్తంభం.
- డూన్ ఎక్స్‌ప్రెస్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుండగా ఈ ఘటన.
- గమనించిన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపివేత.
Train Incident: గత కొన్ని రోజులుగా దేశంలోని వివిధ రాష్ట్రాలలో రైల్వే ట్రాక్ లకు అంతరాయం కలిగించిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల కాన్పూర్ లోని రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్‌ను ఉంచారు. ఇక తాజాగా యూపీలోని రాంపూర్ జిల్లాలో రైల్వే ట్రాక్‌పై ఇనుప స్తంభం పెట్టి ఉండడం ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఈ చర్య రైలును పట్టాలు తప్పించేందుకు ఎవరో ప్రయత్నించినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే., లోకో పైలట్ తెలివిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.
Jani Master Wife: ఆ అమ్మాయి నిజం నిరూపిస్తే.. నా భర్తను వదిలేస్తా!
బిలాస్‌పూర్ నుండి రుద్రపూర్ సిటీ మధ్య నడుస్తున్న డూన్ ఎక్స్‌ప్రెస్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రయాణ సమయంలో లోకో పైలట్‌కు ట్రాక్‌పై పొడవైన ఇనుప స్తంభం కనిపించింది. దాంతో లోకో పైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపి స్టేషన్ మాస్టర్ రుద్రాపూర్ సిటీకి సమాచారం అందించాడు. అనంతరం అధికారులు వచ్చి ట్రాక్‌ను క్లియర్ చేశారు. అనంతరం రైలును సురక్షితంగా ప్రయాణం కొనసాగించారు.
Sri lakshmi Stotram: శుక్రవారం ఈ స్తోత్ర పారాయణం చేస్తే అష్టలక్ష్ములే ధనాన్ని అనుగ్రహిస్తారు
అయితే., రైలు పట్టాలు తప్పేందుకు కుట్ర జరగడం ఇదే మొదటిసారి కాదు. కొద్ది రోజుల క్రితమే కాన్పూర్ లోని రైల్వే ట్రాక్ పై గ్యాస్ సిలిండర్ ను ఉంచారు. కాళింది ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. దీని తర్వాత అజ్మీర్ లోనూ రైల్వే ట్రాక్ పై సిమెంటు దిమ్మెలు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇది కాకుండా, యుపిలోని ఘాజీపూర్ జిల్లాలో రైల్వే ట్రాక్‌పై పెద్ద చెక్క ముక్క పడి ఉంది. అది స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌లో చిక్కుకుంది. దీంతో రైలులో సాంకేతిక లోపం ఏర్పడింది.