- తెలంగాణ కేబినెట్ సమావేశం 26వ తేదీకి వాయిదా
- ఈ నెల 23న జరగాల్సిన కేబినెట్ సమావేశం
- మంత్రివర్గ సమావేశం వాయిదా పడినట్లు తెలిపిన సీఎస్
TG Cabinet: ఈ నెల 23న జరగాల్సిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం 26వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. ఈ నెల 26న సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుందని తెలిపారు. కేబినెట్ సమావేశం వాయిదా పడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు, హైడ్రా ఆర్డినెన్స్‌కు చట్టబద్ధత కల్పించడం, రెవెన్యూ చట్టం, మూసీ బాధితుల అంశం, వరద నష్టం, రైతుభరోసా తదితర అంశాలపై చర్చించే అవకాశముంది. ఈ మేరకు వివరాలను సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు సర్కారు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
Read Also: CM Revanth Reddy: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు